ఉదయం పూట ఖాళీ కడుపుతో కాఫీ, టీ, అలవాటు ఉంటె వెంటనే మానుకోండి. ఎందుకంటే..?
ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగడం అంతమంచిది కాదన్న విషయం మీకు తెలుసా? ఇలా తాగడం వల్ల అవి మీ శరీరానికి స్లో పాయిజన్ లా పనిచేస్తాయనే సంగతి తెలుసా? చిన్నప్పటినుంచి తాగుతున్నాం.. లేదా ఇన్నేళ్లుగా తాగుతున్నాం.. ఏం కాలేదే అనుకుంటున్నారా? అయితే మీకు మామూలుగా వచ్చే ఆరోగ్య సమస్యలకు ఇదీ ఒక కారణం అయి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే బెడ్ కాఫీ ఎంతోమందకి అలవాటు.
కొందరు టీ తాగుతారు. ఎక్కువమందికి ఉదయం లేవగానే ఈ బెడ్ కాఫీ లేదా టీ తాగనిదే ఏ పనీ చేయలేరు. అసలు వారికి తెల్లారినట్టే ఉండదు. అలా.. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ.. పేపర్ చదువుతూ కాఫీ తాగితే.. ఆ హాయే వేరు. ఇలా ఉదయపు కాఫీ, టీని ఆస్వాదించేవారు ఎందరో ఉన్నారు. మన రోజువారి కార్యకలాపాల్లో ఉత్సాహంగా ఉండాలంటే బెడ్ కాఫీతోనే మొదలు అనేది ఎందరో నమ్మకం.
అయితే ఖళీ కడుపుతో ఇదంత మంచిది కాదంటున్నారు ఆహార నిపుణులు.. వైద్యులు. ఉదయమే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియలో మార్పులు వస్తాయని అంటున్నారు. టిఫిన్ చేస్తే అందులోని పోషకాలు శరీరం గ్రహించకుండా ఈ బెడ్ కాఫీ, టీ చేస్తాయంటున్నారు. అందుకే బెడ్ కాఫీ కంటే.. ఉదయం టిఫిన్ చేసిన కాసేపటి తర్వాతే బెడ్ కాఫీ తాగడం మంచిదని అంటున్నారు.
కాఫీ, టీ అనవసరంగా తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. దీనివల్ల సరిగ్గా ఆహారం తీసుకోలేమని అంటున్నారు. ఎక్కువగా టీ, కాఫీ తాగడం కూడా మంచిది కాదని ఆకలి, ఆహారం తీసుకోవడంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. రాత్రిళ్లు నిద్రకు వెళ్లేముందు కొందరు కాఫీ తాగి పడుకుంటారు. ఇది అసలు మంచిది కాదంటున్నారు వైద్యులు. సరిగా నిద్ర పట్టదని అంటున్నారు.
రాత్రిళ్లు కాఫీ మంచి నిద్రను పోగొడతాయంటున్నారు. అయితే.. ఈ అలవాటు దాదాపు లేనివాళ్లు ఉండరు. కానీ.. ఒక్కసారిగా మానేయాలంటే కష్టమే. దీనికి బదులుగా కషాయం, పాలు లేదా వేడి నీరు తీసుకోవడం ఉత్తమమని వైద్యులు చెప్తున్నారు. మొత్తంగా కాఫీ అయినా, టీ అయినా రోజుకు రెండుసార్లు మించి తీసుకోవడం అంత మంచిది కాదనే చెప్తున్నారు వైద్యులు.