పరిగడుపున వెల్లుల్లి, తేనే మిశ్రమాన్ని తీసుకుంటే చెప్పలేని ఆ సమస్యలన్నీ మటుమాయం.
వెల్లుల్లి, తేనే మిశ్రమాన్ని రోజు తినడం వలన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇది యాంటీ బయాటిక్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా.. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇవే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా చాలామంది జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి ఈ చిట్కా ప్రభావంతంగా పనిచేస్తుంది.
నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని దంచి.. అందులో రసాన్ని తీసి తేనెలో కలుపుకొని తాగితే శరీరానికి ప్రయోజనాలు లభించడం కాకుండా.. దగ్గు, జలుబు, కపం వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇది చర్మంపై కూడా ప్రభావంతంగా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు చర్మంపై వ్యాధులను నియంత్రించేందుకు ప్రభావంతంగా పనిచేస్తాయి.
చర్మం పై అలర్జీ, గజ్జి, తామర వంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు తెలుపుతున్నాను. ముఖ్యంగా వెల్లుల్లి రెబ్బలతో తేనెను కలుపుకొని తీసుకుంటే అది దీర్నాక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించి.. వ్యాధుల నుంచి రక్షిస్తుంది. చెడు కొలస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారికి.. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి.. రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు.. తప్పకుండా ఈ వెల్లుల్లి తేనే మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మధుమేహం సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ మిశ్రమం పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా సులభంగా నియంత్రిస్తుంది. కావున సులభంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇందులో యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అందుకే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా నియంత్రిస్తుంది.