Mouthwash: నోటి దుర్వాసన పోవాలని మౌత్ వాష్ వాడుతున్నారా..? అయితే మీకు క్యాన్సర్ రావొచ్చు.

Mouthwash: నోటి దుర్వాసన పోవాలని మౌత్ వాష్ వాడుతున్నారా..? అయితే మీకు క్యాన్సర్ రావొచ్చు.
Mouthwash: నోటి ఆరోగ్యం విషయంలోనూ అంతే శ్రద్ధ అవసరం. దానికోసమే మనం రెగ్యులర్ గా బ్రష్ చేస్తూ ఉంటాం. బ్రష్ చేసినా కూడా కొందరిలో నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది.
అయితే మౌత్ వాష్ గురించి అందరికీ తెలుసు. చాలా మంది దీన్ని రోజూ వాడుతుంటారు. మరికొందరు అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు.
అలాగే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించేటప్పుడు దంతాలను శుభ్రపరచడం, నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందడం కోసం దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారు.
Also Read : షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.
అయితే కొందరు మౌత్ వాష్ దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని నమ్ముతుంటారు. ఇది దంతాలకు మంచిదని భావిస్తున్నప్పటికీ ప్రతిరోజూ మౌత్‌వాష్‌ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయని నిపుణులు అంటున్నారు.
అందుకే మౌత్ వాష్ వాడకాన్ని పరిమితంగా వాడాలంటున్నారు నిపుణులు. అంటే ప్రతిరోజూ వాడకుండా అరుదైన సందర్భాల్లో మాత్రమే వినియోగించడం మంచిది. ఎందుకంటే మౌత్ వాష్ లో ఆల్కహాల్ ఉంటుంది. ఇది మీ నోటిని పొడిగా చేస్తుంది.

అంతేకాకుండా, దీని రోజువారీ వినియోగం శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం మౌత్ వాష్ వాడకం మధుమేహ ప్రమాదాన్ని పెంచుతుంది.
రోజుకు రెండుసార్లు మౌత్‌వాష్‌ని ఉపయోగించేవారిలో పదోవంతు మందిలో ఇది కనుగొనబడింది. మౌత్ వాష్‌లను ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం.
Also Read : షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.
అంతేకాకుండా, ఇది చాలా దుష్ప్రభావాలకు కారణమవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మౌత్‌వాష్‌ను రోజూ వాడేవారికి లేదా అతిగా వాడేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇందులో వాడే పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత తక్కువగా వాడడం మంచిది.