స్టార్ హీరో సినీమా షూటింగ్‌లో ప్రమాదం, స్టంట్ మాస్టర్ మృతి.
ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనున్నారు. చెన్నై శివారులోని వండలూరు సమీపంలోని ఉనమంచెరిలో సన్నివేశం కోసం రైలు పట్టాల సెట్‌ను నిర్మించారు. అందులో రైలు ప్రమాదానికి గురయినట్టుగా చిత్రీకరిస్తున్నారు.
శనివారం ఉదంయ సురేష్ తో సహా కొంతమంది నటులను భారీ క్రేన్‌కు బిగించి తాళ్లతో కట్టివేశారు. అయితే సినీమా షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ స్టంట్ మాస్టర్ మరణించాడు. వివరాల ప్రకారం.. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్, హీరో సూరి కాంబినేషన్‌లో ‘విడుదలై’ అనే తమిళ చిత్రం తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది.ఇందులో భాగంగా భారీ క్రేన్‌కు తాళ్లు బిగించి యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ సురేష్‌కు కట్టిన తాడు తెగిపోయింది.
సుమారు 20 అడుగుల పైనుంచి కింద పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన మూవీ టీం ఆతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. సురేష్ మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అతని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.