ములక్కాడ తింటే నిజంగా ఆ శక్తి పెరుగుతుందా..? అసలు విషయమేంటంటే..?
ములక్కాడ శాస్త్రీయ నామం మొరింగ ఒలిఫెరా. దీనిని యుగాల నుండి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇదొక ఆల్- ఇన్- వన్ మూలకం. ఇందులో యాంటీబయాటిక్, అనాల్జేసిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీకాన్సర్, యాంటీ డయాబెటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ అలాగే యాంటీఏజింగ్ గుణాలు ఉన్నాయి. అయితే రక్తహీనతతో బాధ పడేవారికి కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను మునగాకు పొడినో రోజూ వేడి వేడి గా ఉన్న అన్నంలో వేసుకుని తింటే ఐరన్ వృద్ధి, రక్తం సమృద్ధి జరుగుతుంది.
బాలింతలకు మునగాకు పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలంగా పడతాయి. కంటి కి సంబందించిన జబ్బులు చాలానే ఉన్నాయి .వాటిల్లో రేచీకటి బాధితులూ ఎక్కువే ఉన్నారు. కంటికి సంబందించిన వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ అంటోంది. ఇంటాబయటా అంతటా దుమ్ము ,ధూళి, కాలుష్యమయమే. ఇలాంటి వాతావరణం లో ఉండే మనకి ఆస్తమా, బ్రాంకైటిస్, ట్యుబర్‌క్యులోసిస్ అతి తేలికగా దాడి చేస్తాయి. అందుకే మునగ ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తాగితే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధుల కి దూరంగా ఉండవచ్చు.
ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్ మీద రాస్తే అవి పూర్తిగా తగ్గిపోయి చర్మం కాంతివంతం గా ఉంటుంది. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే పోషకాలు ఎక్కువే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్‌లు ఎముకబలాన్నీ బరువునీ పెంచడానికి ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ కూడా తగ్గిస్తాయి. పిత్తాశయం అద్భుతం గా పనిచేస్తుంది. వీటిల్లోఉండే జింక్ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గేలా చేస్తుంది.
వీర్యం చిక్కబడడం లో తోడ్పడుతుంది. నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు మునక్కాడల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ జీర్ణమయ్యేలా చేయగలవు. రోగనిరోధకశక్తి ఎక్కువ గా ఉండడం వలన శ్వాససంబంధ సమస్యలు తక్కువ గా ఉంటాయి . వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ ఉండడం వలన పోషకాహార లోపమూ రాదు. నాడీవ్యవస్థాచురుగ్గా పనిచేస్తుంది. థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే సహజ ఔషధం మునగాకు.కొంతమంది పిల్లలు రాత్రిళ్లు పక్క తడుపుతూంటారు. అలాంటి పిల్లలకి మునగాకును పెసరపప్పుతో కలిపి కూర వండి పెడితే అద్భుతం గా పనిచేస్తుంది.