ఈ ఆకుని ఇలా చేసి తీసుకుంటే ఆస్థమా, టీబీ, దగ్గు వంటి వ్యాధులు తగ్గుతాయి.
మునగ అనేది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక మొక్క, ఇది ఆసియా, ఆఫ్రికా వంటి ఇతర ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల ప్రదేశాలలో కూడా పెరుగుతుంది. జానపద ఔషధాలలో శతాబ్దాలుగా ఈ మొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలను ఉపయోగిస్తున్నారు. అయితే ములక్కాయల గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. పప్పు చారులో వేసిన,కూరలో వేసిన ములక్కాయ రుచే వేరు కదా. అంత బాగుంటాయి ములక్కాయలు. మన పల్లెటూర్లలో అయితే ఈ ములగచెట్టు ఇంటికొకటి. చొప్పున ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.
అయితే మనమందరం కేవలం మునగకాయను మాత్రమే వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. నిజానికి ములగ చెట్టు యొక్క ప్రతి భాగం కూడా మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రదాన పాత్ర పోషిస్తుంది.వాడుతూ ఉంటాం. ములగ చెట్టు యొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలు, బేరడును ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధాలలో ఉపయోగిస్తున్నారు.మనం నిత్యం తినే ఆకుకూరల కంటే మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. మునగాకుని ఆహారంగా తీసుకోవడం వలన మధుమేహం, బాక్టీరియల్, వైరల్,ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
అలాగే కీళ్ళ నొప్పులు,ఆర్థరైటిస్, అధిక రక్త పోటు ఉన్నవారు కూడా మనగాకు తింటే మంచిది. మునగాకులల్లో పొటాషియం,క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి.అదేవిదంగా మునగాకులో ప్రోటీన్స్, ఐరన్, అమైనో యాసిడ్స్ కూడా ఉండటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు సమపాళ్ళల్లో అందుతాయి.రక్తహీనత సమస్యతో బాధపడుతున్న మహిళలు రోజు కొద్దికొద్దిగా మునగాకును తింటే శరీరానికి కావలసిన ఐరన్ అంది రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పిల్లలకు పాలు పుష్కలంగా అందుతాయి.
కొద్దిగా మునగాకులను తీసుకుని వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు పాటు బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా మునగాకు నీటిని తాగడం వలన ఆస్థమా, టీబీ, దగ్గు వంటి వ్యాధులు తగ్గుతాయి.అలాగే ఒక కప్పు మునగాకును జ్యూస్ చేసుకుని తాగితే మగవారిలో సంతాన సమృద్ధిని పెంచే పోషక విలువలు అధికం అవుతాయి. అలాగే మునగాకును పప్పులో వేసుకుని కూరలాగా కూడా వండుకుని తినవచ్చు.