Mustard Leaves: ఈ ఆకు కూర తరచూ తింటుంటే చాలు, సీజనల్ రోగాలు మీ జోలికిరావు.

Mustard Leaves: ఈ ఆకు కూర తరచూ తింటుంటే చాలు, సీజనల్ రోగాలు మీ జోలికిరావు.
Mustard Leaves: ఆవాల ఆకుల్లోని విటమిన్ కె.. గుండెను కాపాడుతుంది. ఎముకల్ని బలంగా చేస్తుంది. ఇందులోని బైల్ యాసిడ్స్.. జీర్ణ సమస్యల్ని పరిష్కరిస్తాయి. ఆకుల వల్ల కలిగే వేడి వల్ల.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోతుంది. అయితే ఆవాల ఆకుకూరలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం వంటి ఇతర అనేక విటమిన్లు ఉంటాయి. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో ఫైబర్ , ఐరన్ , ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ కె గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. మన శరీరంలో ఉన్న ఎముకలను బల పడేలా చేస్తాయి.
Also Read: ఈ ఆహారపదార్థాలు తింటే మీ ఎముకలు ఉక్కులా బలంగా మారుతాయి.
ఆవాల ఆకు కూరలో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా కంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఆవ కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. పైగా ఈ ఆకుల్లో కేలరీలు ఉండవు. ఇందులో ఖనిజాలు, విటమిన్లు A, C, K పుష్కలంగా ఉంటాయి. ఆవాల ఆకుల్లో విటమిన్ K పుష్కలంగా ఉండి ఎముకలను బలపరుస్తుంది.

గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, రక్తం గడ్డకట్టడంలో విటమిన్ K కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు బరువు తగ్గడానికి మంచి ఆహారం కోసం చూస్తున్నట్లయితే, మీరు ఆవాల ఆకు కూరను తరచూగా తినవచ్చు. ఈ ఆకుకూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి దివ్యౌషధం. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఆవాలు తినాలి, ఎందుకంటే ఇది విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
Also Read: ఒక నెల రోజులు ఖాళీకడుపుతో ఈ పొడిని కొంచం నీటిలో వేసుకొని తాగితే చాలు.
ఆవాల ఆకులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి, క్యాన్సర్‌ని దరి చేరకుండా రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆవ ఆకుల్లో గ్లూకోసినోలేట్స్ అనే ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. గ్లూకోసినోలేట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.