Health

బొడ్డులో ఈ నూనె వేసి మసాజ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

నాభి మర్దన, బొడ్డు చుట్టూ నూనెతో మసాజ్‌ చేయడం. దీని ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాల్లోనూ ఉందంటారు. ముందుగా నెయ్యి, వేప నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, బాదం నూనెలలో ఏదో ఒకటి తీసుకోవాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నాభిపై రెండు మూడు నూనె చుక్కలు పోసి, సున్నితంగా మర్దన చేయాలి. అయితే నాభిపై ఆవాల నూనె, కొబ్బరి నూనె, ఆముదం నూనె, ఆలివ్ నూనె లేదా నెయ్యిని వేయొచ్చు. దీనికోసం మీ నాభిపై రెండు మూడు చుక్కల నూనెను దూది సహాయంతో అప్లై చేసి చిన్నగా చేతులతో మసాజ్ చేసి 20 నిమిషాలు లేదా రాత్రంతా అలాగే ఉంచి ఉదయం క్లీన్ చేసే సరిపోతుంది.

నిజానికి బొడ్డు వెనుక పెకోటి గ్రంధి ఉంటుంది. ఇది నాడులు, కణజాలాలు, అవయవాలతో అనుసంధానించబడి ఉంటుంది. ఇక్కడ నూనెను అప్లై చేయడం వల్ల మొత్తం శరీరానికి శక్తి అందుతుంది. దీనివల్ల మీరు రీఫ్రెష్ గా ఉంటారు. కొంతమందికి చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే మొటిమలు, గోర్ల సమస్యలు, నల్లని మచ్చలు వంటి సమస్యలతో బాధపడేవారికి బొడ్డుపై నూనెను రాయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఇది ఈ సమస్యలను తొందరగా పోగొడుతుంది. బాదం నూనె.. చర్మం, జుట్టుకు మాత్రమే కాదు ఒత్తిడిని తగ్గించేందుకు కూడా బాదం నూనె ఉపయోగపడుతుంది.

ఇందుకోసం రెండు చుక్కల బాదం నూనెను మీ నాభిపై అప్లై చేయండి. ఒత్తిడి క్షణాల్లో తగ్గిపోతుంది. ఒత్తిడి అలాగే మీ చర్మం, జుట్టు కూడా అందంగా మెరిసిపోతాయి. ఆవనూనె.. ఆవనూనె కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నాభిపై ఆవనూనెను అప్లై చేయడం వల్ల మీ పెదాలు ఎప్పటికీ పగలవు. అలాగే మృదువుగా, గులాబీ రంగులో ఉంటాయి. ఆవనూనెను మడమకు అప్లై చేయడం వల్ల.. మడమలు పగలవు. అలాగే చర్మం కూడా తేమగా ఉంటుంది.

డ్రై నెస్ పోతుంది. ఈ నూనె పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. నెలసరి నొప్పి పుట్టినప్పుడు నాభిపై ఆవనూనెను అప్లై చేస్తే.. నొప్పి తగ్గుతుంది. కడుపు తిమ్మిరి కూడా తగ్గుతుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి. నెయ్యి.. ఈ నూనెలకు బదులుగా మీరు బొడ్డుపై స్వచ్ఛమైన నెయ్యిని కూడా అప్లై చేయొచ్చు. నెయ్యిని బొడ్డకు అప్లై చేస్తే డ్రై స్కిన్, డీహైడ్రేషన్ స్కిన్, స్కిన్ సమస్యలు తొలగిపోతాయి. ఇందుకోసం ప్రతిరోజూ మీ నాభిపై స్వచ్ఛమైన నెయ్యిని అప్లై చేయాలి. ఇది మీ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker