Health

మీ గోర్లు ఇలా మారితే మీరు నిర్లక్ష్యం చెయ్యకుండా ఏం చెయ్యాలో తెలుసా..?

కాలి గోళ్ల కన్నా చేతిగోళ్లు త్వరగా పెరుగుతాయి. కాలి గోళ్లు నెలకు 1 మిల్లీ మీటరు పెరిగితే చేతిగోళ్లు 3 మిల్లీ మీటర్ల వరకూ పెరగొచ్చు. చేతిగోరు మొదలు నుంచి చివరి వరకూ పెరగటానికి 100-180 రోజులు పడుతుంది, కాలిగోరు 12-18 నెలలు తీసుకుంటుంది. పోషకాహార లోపం, శారీరక వ్యాధులు, కాళ్లూ చేతులకు రక్తనాళ సమస్యల వల్ల గోళ్ల పెరుగుదలలో వేగం తగ్గొచ్చు. క్యాన్సర్‌ మందులతోనూ వేగం తగ్గొచ్చు. గర్భిణులకు, సోరియాసిస్‌ బాధితులకు వేగంగా పెరుగుతాయి. అయితే మనిషి శరీరంలో చర్మం ప్రాధాన్యత ఎంతగా ఉంటుందో గోర్లు కూడా అంతే. గోర్లు వేళ్లకు పటుత్వాన్ని, అందాన్ని ఇస్తాయి.

అంతేకాదు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడేది కూడా అవే. అందుకే గోర్ల సంరక్షణ చాలా అవసరం. మనిషి శరీరంలో గోర్లను చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. గోర్లు విరిగినా లేదా గోర్లకు దెబ్బ తగిలినా లేదా గోర్లు శుభ్రంగా లేకపోయినా ఫంగస్ వ్యాపిస్తుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో గోర్ల ఫంగస్ దూరం చేయవచ్చచంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. శరీరంలో పోషక పదార్ధాల కొరత లేదా ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే ముందుగా లక్షణం కన్పించేది గోర్లపైనే.

నెయిల్ ఫంగస్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే వెంటనే నియంత్రించవచ్చు. గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు వాము నూనె వాడితే మంచి ఫలితాలుంటాయి. అయితే వాము నూనెను నేరుగా అప్లై చేయకూడదు. రెండు మూడు డ్రాప్స్ వాము నూనె సరిపోతుంది. చిన్న స్పూన్ కొబ్బరి నూనె లేదా జైతూన్ ఆయిల్‌లో వాము నూనె మిక్స్ చేసి..గోర్లపై రాయాలి. ఇలా చేస్తే నెయిల్ ఫంగస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. వెనిగర్ అనేది యాంటీ మైక్రోబియల్. చర్మంపై ఏ విధమైన ఫంగస్ ఉన్నా దూరం చేస్తుంది.

ఒక కప్పు వెనిగర్‌లో 4 కప్పుల నీళ్లు మిక్స్ చేయాలి. ఈ నీళ్లలో చేతులు, కాళ్లను ముంచాలి. 20 నిమిషాల తరువాత చేతులు, కాళ్లను పొడిగుడ్డతో తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ ఫంగస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నూనె ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు చాలా మంచిది. గోర్ల ఆరోగ్యం కోసం కూడా కొబ్బరి నూనె వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెను గోర్లపై నేరుగా అప్లై చేయవచ్చు. దీనివల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్, స్వెల్లింగ్ దూరమౌతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker