Nails: మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే..?

Nails: మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే..?
Nails:శరీంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా జాగ్రత్తపడాలని చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు, వర్కవుట్స్ వంటి చేయాలని సూచిస్తున్నారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయన్న విషయం త్వరగా తెలిస్తే చికిత్స కూడా త్వరగా తీసుకోవచ్చు. దీంతో పలు సమస్యల నుంచి బయటపడొచ్చు. సాధారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలును లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే చేతి గోళ్లపై జరిగే మార్పులు మన అనారోగ్యాలను ముందుగానే చెబుతాయని అంటున్నారు.
Also Read: ఈ సమస్యలున్నవారు సోంపు అస్సలు తీసుకోకూడదు.
క్లీవ్‌ల్యాండ్, మేయోక్లినిక్‌లకి చెందిన శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించి కొన్ని ఆసక్తిర విషయాలను తాజాగా వెల్లడించారు. చేతి గోళ్లలో జరిగే మార్పుల ఆధారంగా మన ఆరోగ్యాన్ని అంచా వేయొచ్చని చెబుతున్నారు. చేతిగోళ్లపైన ఉండే తెలుపురంగు మచ్చలకీ, మనలోని అనారోగ్యాలకీ ఉన్న సంబంధాన్ని పరిశోధకులు గుర్తించారు. గోళ్లలో వచ్చే మార్పులు అనారోగ్యానికి సంకేతంగా భావించాలని వారు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా చేతి గోళ్లలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు అనారోగ్యానికి సంకేతంగా భావించాలని అంటున్నారు. గోళ్లు పలచగా లేదా మందంగా మారినా తెల్లని మచ్చలూ గీతలూ వంటివి కనిపించినా అవి మనలోని అనారోగ్యాలకి సంకేతాలుగా భావించాలని అంటున్నారు. ఒకవేళ చేతి గోళ్లు పలచగా మారి, నిలువు గీతలు స్పష్టంగా ఉంటే అది హార్మోన్ల అసమతుల్యతకీ ముందస్తు సంకేతంగా భావించాలని నిపుణులు అంటున్నారు.
Also Read: ఒక ఆ ముద్దు 80 మిలియన్ బ్యాక్టీరియాను బదిలీ చేస్తుంది.
చేతి గోళ్లలో కనిపించే హైపోథైరాయిడిజమ్‌కి ప్రాథమిక సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. గోళ్లు వంపుగా కాకుండా కొద్దిగా పైకి లేచి చెంచా మాదిరిగా మారితే జింక్, ఇనుము లోపానికి చిహ్నమని భావించాలని అంటున్నారు. అదే విధంగా గోళ్లపై కనిపించే గీతలు ఏర్పడితే అవి ఇన్‌ఫెక్షన్లకీ, మధుమేహానికీ సూచనగా భావించాలని చెబుతున్నారు. ఇలా గోళ్లు చెప్పే విషయాలను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.