ఈ పుట్ట గొడుగులు తింటే ఎలాంటి క్యాన్సర్‌నైనా తగ్గిస్తాయట..?
నల్లని పుట్టగొడుగులను ఇంగ్లీషులో ట్రఫిల్ మష్రూమ్స్ అంటారు.. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. కాకపోతే వీటి ధర కూడా ఎక్కువే.. ఇది మెత్తగా గుండ్రంగా ఉంటాయి. వీటిని అనేక ఔషధ మందుల తయారీ లో ఉపయోగించే వారు వీటిని కూరగా వండుకుని తినవచ్చు. అయితే ట్రఫిల్ మష్రూమ్స్.. ఇవి నల్లని పుట్ట గొడుగులు. పుట్ట గొడుగుల్లో ఇవి ఒక జాతికి చెందినవి. మెత్తగా, గుండ్రగా ఉంటాయి. వీటిని పూర్వం మందుల తయారీలో బాగా వాడేవారట.
అయితే ఇప్పుడు ఈ పుట్ట గొడుగులను తింటున్నారు కూడా. వీటిల్లో మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, వీటిని తరచూ తింటే పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ పుట్ట గొడుగులు సాధారణంగా నలుపు రంగులోనే ఉంటాయి. కానీ వీటికి జన్యు పరమైన మార్పులు చేసి వీటిని తెలుపు రంగులోనూ పండిస్తున్నారు.
ఎక్కువగా ఫ్రాన్స్‌లోని దట్టమైన అడవుల్లో ఈ పుట్టగొడుగులు పెరుగుతాయి. ట్రఫిల్ పుట్టగొడుగులు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడమే కాదు, ఇవి ఖరీదైనవి కూడా. ఒక పుట్ట గొడుగు దాదాపుగా 30 నుంచి 60 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. ధర కిలోకు రూ.2వేల నుంచి రూ.7వేల వరకు ఉంటుంది. అయితే రేటెక్కువే కానీ.. ఈ పుట్టగొడుగులతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. ట్రఫిల్ పుట్టగొడుగుల నుంచి నూనెను తీస్తారు. అది ఆలివ్ నూనె కన్నా ధర ఎక్కువ ఉంటుంది.
ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా దాంతో పుష్కలగా ఉంటాయి. ఈ పుట్టగొడుగుల నుంచి తీసే నూనెను ట్రఫిల్ ఆయిల్ అని పిలుస్తారు. ఇక ఈ ఆయిల్‌ను చాలా వరకు పాస్తాలు, పిజ్జాలలో టేస్ట్ కోసం వాడుతుంటారు. ట్రఫిల్ ఆయిల్‌లో ఉండే పాలిఫినాల్స్ మన శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను, బాక్టీరియాను బయటకు పంపుతాయి. అలాగే క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి కలిగిన ఔషధ గుణాలు ఈ పుట్టగొడుగుల్లో ఉంటాయి. వీటిని తరచూ తింటుంటే క్యాన్సర్ ను అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.