ఈ నల్ల పసుపుని ఆలా చేసి వాడితే జీవితంలో క్యాన్సర్ జబ్బులు రావు.
నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది., పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. నల్ల పసుపును సాధారణంగా భారతదేశంలోని ఈశాన్య, మధ్యప్రదేశ్‌లో పండిస్తారు. అయితే నల్ల పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ-ఆస్తమా, యాంటీ ఆక్సిడెంట్, అనాల్జేసిక్, లోకోమోటర్ డిప్రెసెంట్, యాంటీ అల్సర్ లక్షణాలు ఉంటాయి.
ఇవి కండరాల విశ్రాంతి, ఆందోళన, సీఎన్ఎస్ డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది మన శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నల్ల పసుపు పొట్ట సంబంధ సమస్యలను నయం చేయడంలో ఉపకారిగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పి లేదా గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ నల్ల పసుపు వాడితే మంచి ఫలితం పొందవచ్చు. నల్ల పసుపు పొడిని నీళ్లలో కలిపి నిత్యం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నల్ల పసుపు శ్వాసకోశ వ్యాధులకు చాలా ప్రయోజనకారి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి.. జలుబు, దగ్గు, ఆస్తమాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఈ నల్ల పసుపును ఎవరైనా నిరభ్యంతరంగా వంటల్లో ఉపయోగించుకోవచ్చు. మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు పెద్ద పెద్ద ధ్వనులను వినలేదు. ఈ సమస్య నుంచి బయటపడటంలో నల్ల పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. నల్ల పసుపును ముద్దలా నూరిని నుదుటి భాగంలో అద్దాలి. నల్ల పసుపు వాడటం వల్ల దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మహిళలు బహిష్టు సమయంలో ఎదుర్కొనే పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
నల్ల పసుపు పొడిని వేడి పాలల్లో కలుపుకుని తాగాలి. సాధారణ పసుపు మాదిరిగానే నల్ల పసుపులో కూడా చర్మాన్ని మెరిసేలా చేసే గుణాలు ఉంటాయి. నల్ల పసుపును తేనెతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. శరీరంలో వేడి చేసినప్పుడు, జ్వరం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, శ్వాస సమస్యలు, వాంతులు, పొట్టలో గడబిడలు, దగ్గు వంటివి ఉన్నప్పడు ఈ నలుపు పసుపు కొమ్ములను వాడటం వలన ఉపశమనం పొందవచ్చు.
మూత్ర సంబంధ వ్యాధుల బారి నుంచి బయటపడేందుకు కూడా నల్ల పసుపు బాగా పనిచేస్తుందని నిపుణులు చెప్తుంటారు. దగ్గు, ఆస్తమా నుంచి ఉపశమనం పొందేందుకు రాత్రి పడుకునే ముందు నల్ల పసుపు దుంపను తినాలని నిపుణులు సూచిస్తుంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు నల్ల పసుపు పేస్టును కీళ్ల భాగంలో అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. ఈ నల్ల పసుపు కొమ్మును నీళ్లతో కలిపి పేస్టులా చేసి గాయాలపై రుద్దితే త్వరగా మానుతాయి.