నరాల బలహీనతకు శాశ్వత పరిష్కారం ఇదే, మళ్లి జన్మలో రాదు.
శరీరంఏలో అవయవాలు ఎలా కదలాలి, ఎలా పని చెయ్యాలి, ఎలా ఆలోచించాలి అనేది మెదడు నరాల ద్వారా సంకేతాలని పంపిస్తుంది. అందుకే నాడీ వ్యవస్థ చాలా ముఖ్యం. నరాలు బలహీనపడితే శరీరంలోని అన్ని అవయవాల పనితీరుపై దాని ప్రభావం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నరాల బలహీనత ఉన్న సందర్భంలో సహజంగా నొప్పి, పొడిచినట్లుండడం లేక చక్కిలిగింత ఉన్నట్లుండడం, తిమ్మిరి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాల బలహీనత సమస్య నుండి బయటపడేందుకు చాలా మంది మెడిసిన్స్ ను తీసుకుంటుంటారు.
మందులతో పనిలేకుండా నరాల పటుత్వాన్ని పెంచే సహజమార్గాలు కూడా ఉన్నాయి. ఆహార, జీవనశైలిని మార్చుకోవడమే ఆ మార్గం. కొన్ని రకాల బలమైన ఆహారాలను తింటే నరాలు తిరిగి బలంగా తయారవుతాయి. బలమైన ఆహారం అంటే కూరగాయలు ఆకుకూరలు, దుంపలు ఇవి మాత్రమే కాదు. ధాన్యాలు, విత్తనాలను కూడా ప్రధాన ఆహార భాగాలుగా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ధాన్యాలు, విత్తనాలలో మాంసకృత్తుల తో పాటు శరీరానికి కావలసిన విటమిన్లు శాతము లభిస్తాయి. పాలిష్ పట్టని బియ్యము తో అన్నము, రాగి సంగటి, జొన్న సంగటి ని ప్రధాన ఆహారంగా తీసుకోవాలి.
పాలిష్ పెట్టడం వల్ల గింజ ధాన్యాలపై పొట్టుల్లో ఉండే పనికివచ్చే విటమిన్లు తొలగిపోతాయి. బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పెసలు కందులు మరియు మినుములు మొదలగు వాటి నన్నింటిని వీలైనంతవరకు పొట్టు తీయకుండానే రవ్వ మరియు పిండి చేసుకుని ఆహారంలో ప్రతిరోజు బాగం చేసుకోవాలి. అలాగే సాల్మన్, సార్డినెస్, అవిసె గింజలు, వాల్నట్ మరియు చియా విత్తనాల్లో ఓమోగా 3 కొవ్వులు లభిస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల నరాల బలహీనత నుండి బటయపడవచ్చు. విటమిన్ డి కాల్షియం జీవక్రియ మరియు నాడీ కండరాల వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా సూర్యరశ్మిని పొందడం మెదడు కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. రోజువారి వ్యాయామాలు సైతం నరాల బలహీనతను తగ్గిస్తాయి. నాడీ మరియు మానసిక రుగ్మతల నుండి కోలుకోవడంలో తోడ్పడతాయి. డార్క్ చాక్లెట్లలోని ఫ్లేవనాయిడ్లు మరియు యాంటీఆక్సిడెంట్లు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆకుపచ్చని కూరలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా సమస్యను నివారించుకోవచ్చు. ఎండిన పండ్లైన బాదం, ఆప్రికాట్లు, వాల్‌నట్స్‌లలో మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటుంది. ఈ ముఖ్యమైన పోషకం నాడీ కండరాల ప్రసరణ, నరాలను పఠిష్టం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది.