నరాల బలహీనతను 12 రోజుల్లో శాశ్వతంగా తగ్గించే అద్భుతమైన చిట్కాలు.
దీర్ఘకాలిక తలనొప్పి, కండరాలు బలం కోల్పోవడం, కొంత స్పర్శ కోల్పోవడం, దృష్టిమార్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం, సమన్వయం మందగించడం మొదలైనవన్నీ నరాల బలహీనత లక్షణాలు. మెదడు, నరాల ఆరోగ్యం కోసం ఆహారంలో కొన్ని పోషకాలు తప్పనిసరి. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది బాధపడుతున్న అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య కూడా ఒకటి.
మన చుట్టుపక్కల నివసించే మన కుటుంబంలో ఉండే ఎవరికో ఒకరికి నరాల బలహీనత సమస్య ఉంటుంది. ఈ సమస్య కారణంగా శరీరం తీవ్ర నొప్పులతో కలిగి ఉంటుంది. చాలామందికి రక్తనాళాల సమస్య నరాల బలహీనత సమస్యకు మధ్య తేడాలు తెలీదు. రక్తనాళాలు శరీరమంతా రక్తాన్ని సరఫరా చేస్తే..నరాలు మాత్రం మెదడు ఇచ్చిన సందేశాన్ని అవయవాలకు చేరవేస్తాయి.
బలహీనత సమస్యతో బాధపడుతున్న వారు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నరాల బలహీనత అనేది ఆధునిక జీవన శైలి కారణంగా రావచ్చు. లేదంటే తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా రావచ్చు.
కాబట్టి నరాల బలహీనత సమస్య బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. నరాల బలహీనత సమస్య కారణంగా మొదటగా వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకుండా మెదడులోని నరాలు కూడా చెడిపోయి. ఇతర తీవ్రవ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నరాల బలహీనత లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
నరాల బలహీనత తో బాధపడుతున్న వారు తప్పకుండా విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ b6 పోషకాలు కలిగిన ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అధిక పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకుంటేనే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. బలహీనతతో బాధపడుతున్న వారికి విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ విటమిన్ అధికంగా ఉండే పుట్టగొడుగులు ఇతర కూరగాయలు ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.