Nayanthara Divorce: నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారా..?

Nayanthara Divorce: కెరీర్ పరంగా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ నయనతార మాత్రం ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. గత మూడేళ్ల కిందట విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లి కూడా అయ్యారు. అయితే దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయన్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు.

ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోల స్థాయిలోనే ఆమెకు అభిమానులు ఉన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో వరుస విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. కెరీర్ పీక్స్ లో ఉండగానే దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన యశోద వైద్యులు.
అంతేకాదు ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం విశేషం. ప్రస్తుతం నయన్ ఫ్యామిలీ సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ.. తాజాగా నయనతార చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తన సోషల్ మీడియా ఖాతాలో నయనతార పెట్టిన పోస్ట్ చూస్తే.. “తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, ఆ మ్యారేజ్ పెద్ద తప్పు అవుతుంది.
Also Read: కాశీలో శివుని భక్తిలో లీనమైపోయిన టాలీవుడ్ హీరోయిన్..!
భర్త చేసే పనులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను మీ వల్ల చాలానే ఎదుర్కొన్నా” అని ఉంది. దీంతో ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కాకపోతే నయన్ ఈ పోస్ట్‌ను కొన్ని గంటల్లోనే డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే దాని స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: ఈ నటుడు జాతీయ అవార్డ్ విన్నర్.
దీంతో నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య విభేదాలు మొదలయ్యాయా? వారి వైవాహిక జీవితం ముగిసిపోబోతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. నయన్ విడాకులు చేసుకుంటున్నట్లుగా ఇది ఫస్ట్ హింట్ అని చెప్పేవారు కూడా ఉన్నారు.