ఈ స్కూల్ డ్రస్‌లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు నాజూకు బ్యూటీ! స్టార్ హీరోయిన్!
చాలా మంది నటి నటులు తెలుగులో తీసిన సినిమాలు తక్కువైనా కానీ, తెలుగు ప్రేక్షకులను మెప్పించే తీరు మాత్రం విభిన్నంగా ఉంటుంది. అందులోను ఇప్పుడు మలయాళ భామలు తెలుగు వారి మదిలో సంపాదించుకుంటున్న స్థానం అంత ఇంతా కాదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ముద్దుగుమ్మ కూడా ఈ కోవకు చెందిందే. మలయాళ, తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ.. తన అందంతో.. క్యూట్ నెస్ తో.. వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను.. సంపాదించుకుంది ఈ చిన్నది.
అల్లరి చేస్తూ సినిమాలలో కనిపించినా.. ఎమోషనల్ సీన్స్ లో కూడా తన ప్రతిభ కనబరుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా యూత్ అంతా ఈమె నటనకు, అందానికి.. అల్లరికి ఫిదా అయిపోతుంటారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయం అయినా కూడా.. ఈమె మాత్రం తెలుగు వారి మదిలో మంచి మార్కులే కొట్టేసింది. ఆమె మరెవరో కాదు రాజా రాణి సినిమాతో అందరి మన్ననలు పొందిన నజ్రియా నజీమ్. అయితే ఇక ఈ చిన్నది తెలుగులో డైరెక్ట్ గా నటించిన ఏకైక సినిమా అంటే సుందరానికి అనే సినిమా చేసింది.
ఈ సినిమాలో నాని హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. అంటే సుందరానికి సినిమా హిట్ అవకపోవడంతో.. ఈ చిన్నది తెలుగులో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక ఈ అమ్మడు మలయాళ స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాల జోరు తగ్గించింది నజ్రియా నజీమ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఫొటోలతో ఆకట్టుకుంటుంది.