ఆ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేకుంటే..?
నెలసరి సమయంలో మహిళలందరి పరిస్థితి ఒకేలా ఉండదు. కొంతమంది ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు జరగవు. కానీ ఇంకొంతమంది మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో కడుపు నొప్పి, బాడీ పెయిన్స్, వికారం, వాంతులు, అలసట, చికాకు, వెన్ను నొప్పి వంటి ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అయితే పీరియడ్ మొదటి రోజు ఏదో ఒక కారణం చెప్పి సెలవు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాము. ఇలాంటి సమయంలో అదనంగా సెలవలు ఇస్తే బాగుండు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే కొందరు ఆ సెలవులపై విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పనిచేసేచోట తమకు ప్రాధాన్యత తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే ముందుగానే మీ హ్యాండ్ బాగ్ లో శానిటరీ పాడ్ ఉంచుకోవడం మంచిది.
సడెన్ గా పీరియడ్ వచ్చినా మీకు హ్యాండిల్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. నెలసరి సమయంలో అసౌకర్యానికి గురికావడం సహజమే కాబట్టి, మీ శరీరానికి సౌకర్యవంతమైన బట్టలు ధరించడం చాలా మంచిది. లూజ్ ఫిట్టింగ్ క్లాత్ అయితే ఇంకా మరీ మంచిది. నెలసరి వచ్చినప్పుడు వేడి నీళ్లు తాగడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. డీహైడ్రేషన్ అనేది నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా నీళ్ళు తాగడం చాలా మంచిది.
అలాగే కాఫీ కి బదులుగా హెర్బల్ టీని తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా అడిషనల్ రిలీఫ్ కోసం మెగ్నీషియం ను సప్లిమెంట్ గా తీసుకోవచ్చు. మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. కాబట్టి మెగ్నీషియం సమృద్ధిగా దొరికే పండ్లను తీసుకోవడం మంచిది. నువ్వుల నూనెతో పొత్తికడుపు మీద మసాజ్ చేయడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు. రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల కడుపు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.