నిద్రలో అలాంటి కలలు వస్తున్నాయా..? అది దేనికీ సంకేతమో తెలుసా..?
కొన్ని సార్లు కలలు ఎంత మధురంగా ఉంటాయో, మరికొన్ని సార్లు అంతే భయంకరంగా ఉంటాయి. కలలనేవీ కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెబుతారు. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం కలలుసాధారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో, శరీరం రెండు దశల్లోకి వెళుతుంది. మొదటిది, ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్.
ఈ దశలో మెదడులోని ఆలోచనలు పూర్తిగా స్తంభిస్తాయి. అయితే తాజాగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. మధ్యవయస్కుల్లో రోజూ పీడకలలు వస్తే వారు పెద్దవారయ్యాక చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం ఉందని వెల్లడైంది. పీడకలలు వచ్చే వారిలో మతిమరుపు సమస్య వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంటే వీరిలో మెదడు కణాలు దెబ్బతిన్నాయన్న సంకేతం అన్న మాట. పరిశోధన ఏం చేబుతోంది.. బర్మింగ్ హమ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మూడు అధ్యయనాలను విశ్లేషించారు.
దీనిలో మధ్యవయస్కులు (35 నుంచి 64 ఏండ్లు) 600 మందితో పాటుగా 2,600 పెద్దవయసు (79 ఏండ్ల నుంచి అంతకంటే ఎక్కువ) వారు వయోజనులు పాల్గొన్నారు. వీరిలో నిద్ర నాణ్యత, మెదడు ఆరోగ్యం గురించి పరిశోధన జరిపారు. కనీసం వారానికి ఒకసారి చెడు కలలు కంటున్న మధ్య వయస్కులు రాబోయే దశాబ్దంలో అభిజ్ఞా క్షీణతను అనుభవించే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. చెడు కలల వల్ల నిద్రకూడా సరిగా ఉండదు. ఇది కాస్త చిత్తవైకల్యంతో సంబంధం ఉన్న ప్రోటీన్ల నిర్మాణికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
సాయంత్రం అయితే కెఫిన్ ఉండే కాఫీ, టీలను, ఇతర పానీయాలను తాగకపోవడం బెటర్. ఒత్తిడి నుంచి బయటపడటానికి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిటీ మెండర్స్ తో మాట్లాడండి. టీవీ, మొబైల్ ఫోన్ స్క్రీన్ ను చూసే సమయాన్ని తగ్గించండి. రాత్రి భోజనంలో గ్యాస్ ను కలిగించే ఆహారాలను తినడం మానుకోండి. నిద్రపోయే రెండు గంటల ముందు నుంచి పనిచేయడం, చదవడం మానేయండి. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా రుగ్మతలతో మీరు నిద్రతో బాధపడుతున్నట్లయితే.. వైద్యుడిని సంప్రదించండి.