Health

నిద్రపోయేముందు పాలు తాగే అలవాటు ఉందా..? ఈ విషయాలు మీకోసమే.

వేడి పాలు తాగిన, చల్లటి పాలు తాగినా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు డాక్టర్స్. కొందరు అసలు పాలు అంటే నచ్చదు. రోజులో ఒక గ్లాసు పాలు అయినా తాగే వాళ్ళల్లో బోన్స్ చాలా దృఢంగా ఉంటాయి. ఎండాకాలం లో చల్లటి పాలు తాగడం వల్ల ఒంట్లో వేడి నెమ్మదిస్తుంది. చలికాలంలో రాత్రిపూట వేడి పాలు తాగితే వెచ్చగా ఉంటుంది. అయితే ప్రోటీన్ పుష్కలంగా ఉండే వనరుల్లో పాలు ఒకటి. అందుకే పాలను రోజూ తాగాలని డాక్టర్లు చెప్తుంటారు. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

ఇది ఎముకలను బలంగా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. అయితే పాల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నప్పటికీ.. పాలను 30 ఏండ్లు దాటిన వారు వీటిని తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే 30 ఏండ్లు దాటిన వారిలో లాక్టేజ్ ఎంజైమ్ ఉండదు. దీనివల్ల ఈ పాలను వీళ్లు సులువుగా అరిగించుకోలేరు. మన చిన్న పేగుల్లో లాక్టేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలను చాలా సులువుగా జీర్ణం చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయినప్పటికీ.. 5 సంవత్సరాలు పైబడినప్పటి నుంచి శరీరంలో లాక్టేజ్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇక 30 ఏండ్ల వయసులో ఈ లాక్టేజ్ ఉత్తత్తి మొత్తమే ఆగిపోతుంది. మన శరీరంలో లాక్టేజ్ ఎంజైమ్ లేకుంటే.. పాలు నేరుగా పెద్ద పేగుల్లోకి వెళ్లిపోతాయి. అక్కడ ఉన్న బ్యాక్టీరియా వల్ల పాలు జీర్ణం కావు. అందుకే రాత్రి పడుకునే ముందు పాలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. జీర్ణ సమస్యలు లేకపోయినా.. రాత్రిళ్లు పాలను తాగితే నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. పాలను తాగడం వల్ల రాత్రిళ్లు హాయిగా పడుకుంటారు.

ఎందుకంటే ఇది మంచి నిద్రకోసం మెలటోనిన్ న్ను ప్రోత్సహించడానికి సెరోటోనిన్ ను విడుదల చేస్తుంది. అందుకే గోరు వెచ్చని పాలను తాగితే హాయిగా పడుకుంటారని. అయితే రాత్రి పడుకునే ముందు పాలను తాగడం వల్ల ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే పాలలో ఉన్న కార్భోహైడ్రేట్లు సిర్కాడియన్ లయకు భంగం కలిగిస్తాయి. అందుకే పాలను పడుకునేటప్పుడే తాగకూడదు. పడుకోవడానికి రెండు లేదా మూడు గంటల ముందు పాలను తాగడం వల్ల పెద్దగా సమస్యలేం రావంటున్నారు నిపుణులు.

మొత్తం మీద పాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలు ఒక్క ఎముకలకే కాదు మన మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పాలలో కాల్షియంతో పాటుగా విటమిన్ డి, భాస్వారం మొదలైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముక నిర్మాణం, ఇతర జీవ విధులకు సహాయపడతాయి. పాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker