రాత్రిపూట పదే పదే టాయిలెట్‌కి వెళుతున్నారా..! మీకు ఈ జబ్బు ఉండొచ్చు.
అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు అలవాట్ల వల్ల రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకి వెళ్లాల్సి వస్తుంది. ధూమపానం, మద్యం సేవించడం, టీ-కాఫీ ఎక్కువగా తాగడం, టెన్షన్, ఆందోళనకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అయితే రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల నిద్రసరిగ్గాపోరు. అంటే వీరు రాత్రి పూట 8 గంటలు హాయిగా పడుకోలేరన్నమాట.
రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడాన్ని నోక్టురియా అంటారు. అయితే ఈసమస్య 50 ఏండ్ల వారికంటే తక్కువ వయసు ఉన్నవారికి ఉంటే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే ఇది కొన్ని వ్యాధులకు సంకేతం. అతి చురుకైన మూత్రాశయం (OAB),ప్రోస్టేట్ కణితులు, మూత్రపిండాల సంక్రామ్యత, మూత్రాశయం, డయాబెటీస్, దిగువ కాలు వాపు, ఆందోళన, అవయవ వైఫల్యం, రోలాజికల్ డిజార్డర్, మూత్రనాళ సంక్రామ్యత వల్ల తరచుగా మూత్రం వస్తుంది. అధిక రక్తపోటును ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇచ్చే మూత్రవిసర్జన మాత్ర కూడా నోక్టోరియా సమస్యకు దారితీస్తుంది.
దీంతో పాటుగా రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడానికి మన జీవనశైలి కూడా మరొక కారణం. ఇది ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది. కెఫిన్, ఆల్కహాల్ పానీయాలు ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగినా.. కెఫిన్ ను ఎక్కువగా తీసుకున్నా.. రాత్రిపూట మూత్రవిసర్జన ఎక్కువగా చేస్తారు. ఇవి శరీరంలో ఎక్కువ మూత్ర ఉత్పత్తికి దారితీస్తాయి. ఈ సమస్య తలెత్తినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి వారి సలహాలను తీసుకోవడం చాలా ముఖ్యం. వారు సజెస్ట్ చేసిన మెడిసిన్స్ ను ఉపయోగించండి.
వీటితో పాటుగా మీ జీవనశైలిలో కొన్ని మార్పులను కూడా చేసుకోండి. రాత్రి పడుకునే 2 నుంచి 4 గంటల ముందే తాగునీరు తాగండి. ఆ తర్వాత తాగడం మానుకోండి. ఇక ఉదయం లేచిన వెంటనే వీలైతే రెండు గ్లాసుల వేడినీటిని తాగండి. లేదంటే నార్మల్ వాటర్ నైనా తాగండి. కెఫిన్, ఆల్కహాల్ వంటి వాటిని తాగే అలవాటును తగ్గించండి. ఇకపోతే పడుకునే ముందు మూత్రవిసర్జన ఖచ్చితంగా చేయండి. అలాగే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు, యోగాను క్రమం తప్పకుండా చేయండి. వీటివల్ల మీ కండరాలు బలోపేతం అవుతాయి. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.నిద్రకూడా హాయిగా పడుతుంది.