Health

రాత్రి ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతున్నారా..? మగవాళ్లకు ఆ సమస్య రావొచ్చు.

నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా, బాత్‌రూమ్‌లో ఉన్నా, బయట ఉన్నా ఫోనే లోకం. ఆఖరుకు నిద్రపోయే సమయంలోనూ ఒడిలో పెట్టుకోవడమో, దిండు కింద పెట్టుకోవడమో వంటివి చేస్తున్నాం. అయితే ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

అయితే మొబైల్ ఫోన్ రేడియేషన్ కారణంగా అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు…బ్లూ కిరణాల కారణంగా నిద్రను ప్రేరేపించే మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఫలితంగా నిద్ర లేమి సమస్య వస్తుంది. ఫోన్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌ కారణంగా మెదడు క్యాన్సర్‌ వస్తుందని డబ్ల్యూహెచ్ఓ గతంలోనే హెచ్చరించింది.

కాబట్టి ఫోన్‌ను అధికంగా వినియోగించకుండా మనకు మనమే నియమాలు, నిబంధనలు విధించుకోవాలి.ఫోన్‌ను కనీసం మూడు అడుగుల దూరంలో ఉంచి నిద్రపోవాలి.. రాత్రి పూట నిద్రపోయే ముందు చాలా మంది ఫోన్‌తో టైమ్ పాస్ చేస్తుంటారు. ఇలా చేస్తే అరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి నిద్రపోయే సమయానికి అరగంట ముందు స్మార్ట్‌ ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. నిద్రపోయే ముందు నోటిఫికేషన్స్, వైబ్రేషన్స్ రాకుండా సెట్టింగ్స్ చేసుకోవాలి.

ఫోన్‌ పక్కనే ఉంచి నిద్రపోవడం వల్ల..ఉదయం మూడీగా, అలసిపోయినట్టు, డిస్టర్బ్‌గా లేస్తూ ఉంటారు. నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ, స్థూలకాయం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఫోన్‌ సైలెంట్‌ కిల్లర్‌గా మారి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. మొబైల్ ఫోన్‌లు రేడియేషన్‌ను విడుదల చేస్తాయనే విషయం చదువుకున్న అందరికీ తెలుసు..ఇది మెదడును దెబ్బతీస్తుంది. ఫలితంగా తలనొప్పి, కండరాల నొప్పి సమస్యలు వస్యాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker