రాత్రి ఈ చిన్న పని చేస్తే చాలు వెంటనే నిద్రలోకి జారుకుంటారు.
కరోనా నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు. అయితే వాతావరణంలో కలిగే మార్పులు కారణం కావచ్చు, మరేదైనా వ్యక్తిగత విషయం కావచ్చు..
చాలామంది సుఖ నిద్రను కోల్పోతున్నారు. సుఖంగా నిద్ర పోయి ఎన్నో రోజులు అయి ఉంటుంది చాలామందికి. అయితే రోజులో ఎక్కువసేపు ప్రశాంతంగా ఉంటే హాయిగా నిద్రపడుతుందట. మనసు ప్రశాంతం గా ఉండాలి అంటే సాధ్యమైనంతవరకూ మీకు ఇష్టమైతే, ఒంటరిగా గడపడానికి ప్రయత్నించాలి. అయితే ఇలా ఒంటరిగా గడపడం వల్ల మీరు గడిపిన ప్రతిక్షణాన్ని గుర్తు చేసుకుంటూ, ఏ విషయాన్ని మర్చిపోవాలో, ఏ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి అనే విషయం పైన మీకంటూ ఒక అవగాహన వస్తుంది.
వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పగటిపూట తిరగడం అలవాటు చేసుకోవాలి. పర్యావరణంలో కనీసం 30 నిమిషాల పాటు గడిపేలా, మీ సమయాన్ని కేటాయించుకోవాలి. రాత్రిపూట పడుకునేముందు సాధ్యమైనంత వరకు ఆరుబయట స్వచ్ఛమైన గాలిని పీల్చి, పడుకునే లాగా ప్రయత్నించాలి. ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల నిద్ర సుఖంగా వస్తుంది.
మీరు తీసుకునే ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అది హై ప్రోటీన్ డైట్ అయినా నిద్రలేమికి దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఆల్కహాల్, కాఫీ, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను రాత్రి సమయంలో అసలు తినకూడదట. ఇవి మీ నిద్రను దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.