Health

ఈ గింజలని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

మంచి రుచిని కలిగి ఉన్న చాలా రకాల మసాలా దినుసులు కంటే ఇవి అతి తక్కువ రుచిని కలిగి ఉన్నందువల్ల చాలామంది వారి వంటకాలలో ఇవి ముఖ్యమైనవి కావని భావిస్తారు. అయితే మనం తరచుగా కొన్ని గింజలని రాత్రిపూట నానబెట్టి ఉదయమే తింటాం. దీనివల్ల పోషక విలువులు పెరుగుతాయని నమ్ముతాము. ఇటువంటి ఆహారాలు మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. వీటిని ఉదయం పూట తింటే మేలు జరుగుతుంది.

అందుకే వాటిని సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు. నానబెట్టిన ఆహార పదార్థాల జాబితాలో కొన్ని గింజలు, విత్తనాలు ఉన్నాయి. ఎండుద్రాక్షను పొడిగా తినవచ్చు. కానీ నానబెట్టి తీసుకుంటే అందులో ఐరన్ మొత్తం పెరుగుతుంది. ఇది జుట్టు రాలడం, చర్మ సమస్యలను తొలగిస్తుంది. నానబెట్టిన తర్వాత ఎండుద్రాక్ష నీటిని కూడా తాగవచ్చు. బాదంపప్పు తింటే మెదడుకు షార్ప్ అవుతుందని, బరువు తగ్గుతారని చెబుతారు. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే వీటిన నానబెట్టి తినడం మంచిది. అత్తి పండ్లలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇది పోషకాలు అధికంగా ఉండే పండు. ఇందులో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రమాదాల నుంచి రక్షిస్తాయి. ఎండిన అంజీర్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తింటే చాలా మంచిది.

అవిసె గింజలలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ గింజలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తినాలి. మెంతులు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకం తొలగిపోతుంది. దీని కోసం కొన్ని మెంతులని రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం తాగాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker