అమిత్ షా పిలిచినా వెళ్లని హీరో నిఖిల్. ఎందుకో తెలుసా..?

హీరో నిఖిల్ తాజాగా మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో రానున్నారు. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జూన్ 28న ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో మీడియా ప్రతినిథులు అడిగిన పలు ప్రశ్నలకు నిఖిల్ సమాధానమిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మొన్న కార్తికేయ 2, ఇప్పుడు స్పై.. మీరు ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవాలని పిలిచారంట కదా ఓ మీడియా ప్రతినిథి అడగ్గా.. నిఖల్ మాట్లాడుతూ.. ‘అమిత్ షా నుంచి నాకు ఆహ్వానం అందింది. పూర్తీ వివరాలోకి వెళ్తే కేంద్ర మంత్రి అమిత్ షా నుంచి ఆహ్వానంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. షా ఆహ్వానించినా వెళ్లకపోవడంపై ఆయన స్పందించారు.

ఎందుకు వెళ్లలేదో అసలైన కారణం చెప్పారు. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని వెళ్లలేదని స్పష్టం చేశారు. తనని ఆహ్వానించినందుకు అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు. నిఖిల్ కథానాయకుడిగా గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘స్పై’.

తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ‘స్పై’ తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం చిత్ర చూస్తే అర్థమవుతోంది. ‘‘నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. జెండాలు అజెండాలు లేవు. నిజాయతీతో తీసిన చిత్రమిది.

నిజమైన రా ఏజెంట్లులా మేం శిక్షణ తీసుకున్నాం. నేను ఏ పార్టీకీ అనుకూలంగా సినిమాలు తీయడం లేదు. ఒక భారతీయుడిలా ఈ సినిమా చేస్తున్నా. కృష్ణుడిపై ఉన్న భక్తి భావంతోనే ‘కార్తికేయ2’ ఒప్పుకొన్నా. కేంద్ర మంత్రులతో పాటు, ప్రతి పక్ష నాయకులకీ ‘స్పై’ సినిమా చూపిస్తాం’’ అని నిఖిల్ వివరించారు.