News

నిత్యానంద చీకటి బాగోతం బయటపెట్టిన మహిళా, నిత్యానంద నాటకానికి తెర.

గత నెలలో జరిగిన ఐక్యరాజ్యసమితి కీలక సమావేశంలో కైలాస దేశ ప్రతినిధిగా విజయప్రియ నిత్యానంద అనే మహిళ హాజరయ్యారు. ఆమెతోపాటు పలువురు మహిళా ప్రతినిధులు వచ్చినప్పటికీ.. ఐక్యరాజ్యసమితి సమావేశంలో విజయప్రియ ప్రసంగం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (CESCR) నిర్వహించిన చర్చలో ఆమె మాట్లాడుతూ..హిందూమతంలోని ప్రాచీన సంప్రదాయాలను పునరుద్ధరించినందుకు నిత్యానంద వేధింపులకు గురవుతున్నారని, ఆయన పుట్టిన దేశం(భారత్) నుంచి నిషేధించారని ఆమె వ్యాఖ్యానించారు. అయితే తాజాగా నిత్యానంద అనేక చీకటి దోపిడీలను బహిర్గతం చేసేందుకు అతని మాజీ అనుచరులు కొందరు ముందుకు వచ్చారు.

పరారీలో ఉన్న నిత్యానంద మాజీ శిష్యురాలు సారా లాండ్రీ అనే మహిళా.. ఆయన చీకటీ పనులను బహిర్గతం చేసింది. ఆమె ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ… తాను 2009లో నిత్యానంద ఆశ్రమంలో చేరానని తెలిపింది. తాను సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలని, యోగా, మెడిటేషన్ నేర్చుకోవాలనే భావనతో అక్కడ చేరినట్లు తెలిపింది. తాను పెద్ద చదువులు చదివానని, ట్రైనింగ్ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్‌కు వెళ్లేదాననని చెప్పుకొచ్చారు. మతపరమైన పాఠాలు చెప్పేందుకు ఆయన సొంతంగా సంస్థను నిర్వహించడం లేదని, ఆశ్రమాన్ని మాఫియాలా పని చేయించాడని సారా పేర్కొంది.

తాను 24 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నానని తెలిపింది. తొమ్మిదేళ్ల పాటు నిత్యానంద సూచనల మేరకే తన జీవితం సాగిందని ఆ మహిళ పేర్కొంది. తాను ఆశ్రమాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసి పలు వివాదాల్లో ఇరికించారని తెలిపింది. తాను హిందువు కాదని, తన ఆశ్రమంలోని పిల్లలను కొట్టారని తనపై ఆరోపణలు చేశారని సారా పేర్కొంది. దీని తర్వాత తాను నిత్యానంద ఆశ్రమంలో పని చేసే ఆమె మాజీ అనుచరుడితో మాట్లాడానని తెలిపింది. అక్కడ పిల్లలను చంపడం, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు తనకు తెలిసిందని వ్యక్తి చెప్పాడని, అంతేకాక తప్పుడు పనులకు పురిగొల్పుతున్నారని తెలిపింది.

ఇదే సమయంలో ఆ ఆశ్రమంలో తమను తాము సన్యాసులుగా చెప్పుకునే మహిళలు చాలా మందిని ప్రభావితం చేయగలిగారని ఆ మహిళ తెలిపింది. అలానే నిత్యానంద ప్రస్తావించిన కైలాసం గురించి కూడా సారా ప్రస్తావించింది. కైలాసం అనేది ఒక నకిలీ కథనమని, ఒక తప్పుడు దేశమని, అది నిత్యానంద సృష్టించిన ఓ అభూత కల్పన అని తెలిపింది. ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన అతడిని శిక్షించాలని భారత్‌ను అభ్యర్థిస్తానని సారా అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker