ఇండస్ట్రీలో శ్రీను వైట్ల కష్టాలు ఎలా ఉన్నాయో తెలిస్తే..?
శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు. అయితే తాను తన దైనశైలిలో కామెడీ కి కమర్షియల్ అంశాలు కలిపి హిట్ ఫార్ములా తయారు చేశాడు.
కాని రాను రాను అది జనాలకు మొహంమొత్తి తన సినిమాలను చూడ్డం మానేశారు. ప్రస్తుతం ఏ నిర్మాత కూడా తన ఇంటికెల్లే సాహసం చేయడం లేదు. గతంలో మహేష్ బాబు దూకుడు తర్వాత, తన రేంజ్ రాజమౌళిని దాటి పోయేలా వుంది అన్నవారు, తర్వాత వచ్చిన మిస్టర్, రవితేజ సినిమాలతో విపరీతంగా ట్రోల్ చేయడం చేసారు. దీంతో ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్ సినిమాలకు దూరంగా వున్నారు.
మధ్యలో భార్యతో విభేదాలు వచ్చి విడాకుల వరకు వెళ్ళింది. తర్వాత మంచు విష్ణు, తన కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఢీ కి సీక్వెల్ తీస్తున్నామని చెప్పాడు. దీనికి ఢీ అంటే ఢీ అనే టైటిల్ కూడా అనుకున్నారు. కాని ప్రస్తుతం ఆ సినిమా ఎక్కడా వినిపించడం లేదు. విష్ణు మాత్రం జిన్నా సినిమాలో నటిస్తున్నాడు. మరో వైపు రవితేజ తో సినిమా అనుకున్నారు, అదీ కూడా నిజం అయ్యేలా లేదు.
తాజాగా ప్లాప్ ముటగట్టు కున్న శ్రీను వైట్ల సినిమా ఒకే చేయించుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.గోపీచంద్ కు తన దైన శైలిలో అన్ని అంశాలు వున్న కథ చెప్పాడని, దానికి ఆ ప్లాప్ అంగీకరించాడని టాలివుడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే స్క్రిప్టు వర్క్ పక్కాగా వచ్చేందుకు రాత్రి పగలు తెగ కష్టపడుతూ ఉన్నాడని అంటున్నారు .ఈ సినిమా అయినా స్టార్ట్ అయి శ్రీనువైట్ల ను మళ్లీ లైమ్ లైట్ లోకి తెస్తుందేమో వేచిచూడాలి