ఈ ఉల్లిపాయ రసం టీస్పూన్ తాగితే మీ శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది.
ఉల్లిపాయలో యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి. ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయం చేయటంలో సహాయపడుతుంది.
అయితే ఉల్లిపాయలను మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. అనేక రకాల కూరలలో మనం ఉల్లిపాయను వాడుతాం. ఉల్లిపాయలు లేకుండా అసలు కూరలు పూర్తి కావు. కొందరు వీటిని నేరుగా పచ్చిగానే తింటుంటారు. అయితే మీకు తెలుసా.. ఉల్లిపాయలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి.
వీటిని రోజూ పలు రకాలుగా తీసుకోవడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడేవారు రోజూ 100 గ్రాముల మేర ఉల్లిపాయలను తీసుకోవడం చాలా మంచిది. ఉల్లిపాయ రక్తంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దంతాల నొప్పితో బాధపడేవారు ఆ దంతాలకు లేదా చిగురుకు దగ్గరలో చిన్న ఉల్లిపాయను పెట్టుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది.
ఉల్లిలోని ఐరన్‌ని మన శరీరం తేలిగ్గా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారికి ఉల్లిపాయ చాలా మంచిది. లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఉల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శృంగార కోరికలను పెంచడమే కాకుండా.. జననేంద్రియాలను పట్టిష్టం చేస్తుంది. తెల్ల ఉల్లిపాయలను పొరలుగా చీల్చాలి.
అనంతరం దాన్ని దంచాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వెన్నతో కలిపి వేయించాలి. దీన్ని ఒక టీస్పూన్ మోతాదులో తేనెతో కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. దీంతో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఇలా రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.