Orange Fruit: ఈ బత్తాయి పండ్లు తిన్నాక, వీటిని అస్సలు తినకూడదు, తిన్నారో విషంతో సమానం.

Orange Fruit: ఈ బత్తాయి పండ్లు తిన్నాక, వీటిని అస్సలు తినకూడదు, తిన్నారో విషంతో సమానం.
బత్తాయిలోని రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సమర్థంగా పనిచేస్తుంది. బత్తాయి రసాన్ని తరచుగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. అయితే నారింజ, కమల, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లను తినే విషయంలో కొన్ని నియమాలు గుర్తించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అలాంటి పండ్లను పరగడుపున తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. సిట్రస్ పండ్లలో ఉండే ఆమ్ల లక్షణాల వల్ల జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతుందని చెబుతున్నారు.. ఈ ఆమ్ల లక్షణాలు జీర్ణాశయంలోని పై పొరకు ఇబ్బందికరంగా మారతాయి. అందువల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్తి లాంటి పొట్ట సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
Also Read: ప్రతి రోజు రాత్రి 10గంటలలోగా నిద్రపోతే చాలు.
వీటిని రాత్రి తినడం వల్ల గుండెల్లో మంటగా అనిపించి నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. బత్తాయి పండ్లు ఎక్కువగా తినడం వల్ల దగ్గు, అలెర్జీ, జలుబు సమస్యలు వచ్చే ప్రమాదముంది. బత్తాయి పండ్లు తిన్న వెంటనే కాఫీ,టీ వంటివి తీసుకోవటం వల్ల కడుపులోకి పోయి కొన్నిరసాయనాలు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: మీ తెల్ల జుట్టుని ఈ చిట్కాలు ద్వారా 5 నిమిషాల్లోనే నల్లగా మార్చుకోవచు.
ఇవి జీర్ణవ్యవస్థ మీద ప్రభావంచూపించి, విషంగా కూడా కొన్ని సందర్భాలలో మారతాయి. బత్తాయి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలు, అజీర్తితో బాధపడేవారు బత్తాయిని ఎక్కువగా తినకూడదు. గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో పుల్లటి తేన్పులు వచ్చే ప్రమాదముంది. అందుకే.. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.