Health

అతిగా చెమట పడుతుందా..? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి.

కొందరిలో అధిక చెమట చికాకు కలిగిస్తుంది. చెమట నుంచి వెలువడే దుర్వాసన పక్కవారికి అసౌర్యం కలుగుతుంది. కానీ అధిక చెమట నివారణకు పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం. శరీరానికి చెమట పట్టడం మంచిదే. మన ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, శరీరంలో అధిక ఉండే వేడి తగ్గించడానికి చెమట పట్టడం అనేది ముఖ్యమైన విధి. కానీ కొన్నిసార్లు శరీరానికి అధికంగా చెమటపడుతుంది. అలాంటి సందర్భాల్లో చర్మంపై ఉండే బాక్టీరియాకు చెమట తోడు కావడం వల్ల మన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది.

అధికంగా చెమట పట్టడాన్ని పామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. చంకలు, పాదాలు, అరచేతుల్లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల ప్రతి ఒక్కరూ అసౌకర్యంగా భావిస్తుంటారు. అయితే చెమట పడితే శరీరానికి మంచిదే. వ్యర్థాలు ఆ రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కానీ కొంతమందికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇటువంటి వారు ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. చిన్న మార్పుల ద్వారా సమస్యను అదిగమించవచ్చు.

శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో విటమిన్ బి ఉండేలా చూసుకోవాలి. అరటిపండ్లు, గుడ్లు, గింజలు, ఆకుపచ్చని ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి. శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్ ఉండేలా చూసుకోవాలి. అరటిపండ్లు, గుడ్లు, గింజలు, ఆకుపచ్చని ఆకుకూరలు ఈ జాబితాలోకి వస్తాయి. శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు.

అందుకోసం పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. జింక్ తగినంత ఉంటే నోటి, శరీర దుర్వాసనల తొలిగిపోవడంతోపాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. పది గ్రాముల గుమ్మడి గింజలని తింటే వాటి నుంచి రోజువారీ అవసరాలకు కావాల్సిన జింక్‌లో 70% లభిస్తుంది. గోధుమగడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు రెండు టీస్పూన్లు వెనిగర్, ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.

కార్న్‌స్టార్చ్, బేకింగ్ సోడాలను కొద్దికొద్దిగా తీసుకొని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. చంకల్లో ఎలాంటి తడి లేకుండా చూసుకొని ఆ మిశ్రమానిన రాయాలి. 30 నిమిషాల తర్వాత అలాగే ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. అలాగే గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే ఎక్కువగా రాకుండా ఉంటుంది. ప్రతిరోజూ ఏదైనా ఒక సమయంలో ఒక గ్లాసు టమాటా జ్యూస్‌ను తాగినా చెమట పట్టకుండా చూసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker