Overripe Bananas: బాగా పండిన ఇలాంటి అరటి పండ్లు తింటే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

Overripe Bananas: బాగా పండిన ఇలాంటి అరటి పండ్లు తింటే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
Overripe Bananas: అతిగా పండిన అరటి పండ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. బాగా పండిన వాటిల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు విరివిగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అయితే బాగా పండిన అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. దీంతో పాటు సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాదు.. బాగా పండిన అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
Also Read: ఈ ఆకు కూర తరచూ తింటుంటే చాలు.
బాగా పండిన అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి రోజు భోజనం తర్వాత బాగా పండిన అరటి పండు తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బాగా పండిన అరటి పండు తినటం వల్ల రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని రక్షించటంలోనూ పండి అరటి పండు మేలు చేస్తుంది.

అంతేకాకుండా శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండులోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. ఎక్కువ వ్యాయామం, ప్రతి రోజు జిమ్ చేసేవారు బాగా పండిన అరటి పండ్లను తినడం ఎంతో మంచిది. ఇది కండరాల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కండరాల నొప్పిని తగ్గించి, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: ఈ ఆహారపదార్థాలు తింటే మీ ఎముకలు ఉక్కులా బలంగా మారుతాయి.
అంతేకాకుండా చర్మ సంరక్షణకు ఎంతో పని చేస్తుంది. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారికి మాగిన అరటి పండు మంచిది. రోజు పడుకునే ముందు బాగా పండిన అరటి పండును తినడం వల్ల శరీరానికి మెలటోనిన్ హార్మోన్ లభించి మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా అరటి పండును తినాలని నిపుణులు సూచిస్తున్నారు.