పచ్చి ఉల్లిపాయని ఇలా తింటే ఎన్ని రోగాలు తగ్గిపోతాయో తెలుసా..?
ఉల్లిపాయలో యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అయితే ఉల్లిపాయ పేరు వింటే చాలు మనకు గుర్తు వచ్చే సామెత ఒక్కటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని..ఇది కేవలం సామెత మాత్రమే కాదు వందశాతం నిజం.మన వంటింట్లో ఏది ఉన్నా లేకున్నా ఉల్లిపాయ మాత్రం తప్పనిసరిగా ఉండి తీరాలిసిందే.. ఉల్లిపాయ లేని వంట చేయడం అంటే చాలా కష్టం అనే చెప్పాలి.
ఉల్లిపాయను వాడడం వల్ల వంటల రుచి పెరుగడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వంట గదిలో వంట చేసేటప్పుడు చేతులు కాల్చుకోవడం సహజమే. అయితే అలాంటప్పుడు కాలిన గాయాలు త్వరగా మానాలంటే ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది.అది ఎలా అంటే ఒక ఉల్లిపాయను తీసుకుని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కోసి కాలిన గాయాలపై రాయాలి.ఇలా రాయడం వలన ఉల్లిపాయలోని రసం కాలిన గాయానికి అంటుకుంది.
తరువాత ఈ ముక్కలను కాలిన గాయాలపై అలానే 5 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల కాలిన గాయాల వల్ల కలిగే నొప్పి తగ్గడంతో పాటు గాయాలు కూడా త్వరగా నయం అవుతాయి. ఉల్లిపాయతో ఉపయోగం.. అలాగే ఒక్కోసారి చెవులు సరిగా వినపడకుండా మూసుకుపోయినట్టుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు ఉల్లిపాయను ఉపయోగించడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. దీనికోసం ఒక ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి. తరువాత ఒక ముక్కను తీసుకుని చెవి రంధ్రానికి ముందుభాగంలో మాత్రమే ఉంచాలి.
అయితే ఈ ఉల్లిపాయ ముక్క చెవి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రాత్రంతా ఉల్లిపాయ ముక్కను అలాగే చెవిలో ఉంచాలి. మరుసటి రోజూ ఉల్లిపాయ ముక్కను తీసేసి చెవిని శుభ్రం చేయాలి.ఇలా చేయడం వల్ల చెవి సమస్య తగ్గి వినికిడి సులభతరం అవుతుంది. అలాగే శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉల్లిపాయను ముక్కలుగా కోసి ఒక క్లాత్ లో వేసి కట్టి శరీరం,అరి కాళ్ల మీద రుద్దడం వలన ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది.ఇవే కాకుండా పచ్చిఉల్లిపాయలను తినడం వలన ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.కాబట్టి ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలు ఉండేలా చూసుకోవాలి.