జబర్దస్త్ పవిత్ర ఇల్లు చూసారా..? ఆమె కష్టాలు తెలిస్తే కన్నీళ్లు వస్తాయి.
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో పాగల్ పవిత్ర కూడా ఒకరు. మొదట టిక్‌టాక్ వీడియోలు చేసుకునే ఆమె జబర్దస్త్‌లోకి వచ్చాక బాగా పాపులరైంది. తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఆకట్టుకుంటోంది.
బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్ లో కనిపిస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. అయితే కామెడీ షోలో మహిళలు కూడా భాగస్వామ్యులయ్యారు. మగవారికంటే కూడా మేమేం తక్కువ కాదంటూ సరికొత్త స్కిట్లతో గ్యాప్ లేని పంచులతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. అందులో పవిత్ర కూడా ఒకరు.
గతేడాది తండ్రిని కోల్పోయిన ఆమె కుటుంబ పోషణను తన భుజాల మీద వేసుకుంది. తాజాగా ఆమె ఓ పాతింటిని కొనుగోలు చేసి దానికి మెరుగులు దిద్దుతోంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో ద్వారా వెల్లడించింది. ఈ వీడియోలో పవిత్ర మాట్లాడుతూ.. ‘నేను పుట్టి పెరిగిన ఊరిలో ఇంతవరకు సొంతిల్లు లేదు.
నాకు బ్యూటీ సెలూన్ ఉండేది. అది అమ్మేయగా వచ్చిన డబ్బులతో పాత ఇల్లు అమ్ముతుంటే నేను తీసుకున్నాను. కాకపోతే వాస్తు బాలేదని కొన్ని మార్పుచేర్పులు చేస్తున్నాను. ఇంకో నెలలో నాన్న సంవత్సరీకం ఉంది. అప్పటిలోపు ఇంటిపనులు అన్నీ పూర్తి చేయాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.