కేంద్రం కొత్త రూల్, వణుకు పుట్టించే న్యూస్ చెప్పిన కేంద్రం, డిసెంబర్ 31 తరువాత కూడా..!
పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు అలర్ట్ చేసింది. ఇందుకుగాను ఇచ్చిన గడువు కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎవరైనా ఆధార్,పాన్ లింక్ చేసుకోకపోతే జరిమానాతో లింక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే డిసెంబర్ 31వ తేదీలోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో కచ్చితంగా లింక్ చేసుకోవాలని తేల్చి చెప్పారు. అయితే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో కచ్చితంగా లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో వందల సార్లు హెచ్చరించింది.
అయినా కూడా చాలా మంది ఆ పని చేయట్లేదు. దేశంలో రోజుకు ఎన్నో రకాల ఆర్థిక మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. వాటిని అరికట్టడానికి ప్రధాన దారి ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయడం. దేశంలో పెరిగిపోతున్న ఆర్ధిక మోశాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే గడువు కూడా ముగిసింది. అందుకే ప్రస్తుతం ఎవరైనా ఆధార్,పాన్ లింక్ చేసుకోకపోతే జరిమానాతో లింక్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది.వచ్చే డిసెంబర్ 31వ తేదీలోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేయకపోతే తర్వాత డీయాక్టివేట్ అవుతాయి.
ఆ తర్వాత కొత్త పాన్ కార్డ్ తీసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే పలు సమస్యలు ఎదుర్కోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు ఫిన్ టెక్ సంస్థలు వినియోగదారుల అనుమతి లేకుండానే కస్టమర్ పాన్ కార్డు సమాచారాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాయి. అందువల్ల కూడా ఆర్థిక మోసాల కేసులు పెరిగిపోతున్నాయి. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావడంతో చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అందుకే డిసెంబర్ 31లోపు పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత ఎలాంటి డిజిటల్ పేమెంట్స్ జరగవు. అంతేగాక పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుందని అంటున్నారు. కాబట్టి కచ్చితంగా డిసెంబర్ 31 లోపు ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.