పనీర్ ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?
ప్రపంచంలోని ఇతర జున్నులు వలె కాకుండా పనీర్ తయారీలో రెన్నేట్ అనే పండుని సంయోజకారిగానూ సహాయకంగా తీసుకోరు. దీని తయారీ అంతా పూర్తి స్థాయి లాక్టో వెజిటేరియన్ పద్ధతి, ఇది భారతదేశంలోని శాఖాహారులకి ప్రోటీన్లని అందించే మూలాలలో ఒకటి. ఇది సాధారణంగా లవణరహితం. అయితే ఇంట్లో పండగ వచ్చి అందులో పనీర్ కర్రీ తప్పని సరిగా ఉండాల్సింది. ఈ కూర లేకుండా పండగలన్నీ అసంపూర్ణమేనని పూర్వీకులు చెబుతూ ఉంటారు.
పనీర్ శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా ఆహారాల్లో వినియోగిస్తారు. అయితే చాలా మంది నాన్‌వెజ్ తినని వారు పంక్షన్స్‌లో పన్నీర్‌ను తింటూ ఉంటారు. అయితే పన్నీర్‌ను అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పనీర్ ను అతిగా తినడం వల్ల చర్మంపై అలెర్జీ వంటి సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అయితే ఫుడ్ పాయిజనింగ్.. ప్రస్తుతం చాలా మంది ఫిజ్జాల్లో అతిగా పనీర్ కలిగిన వాటిని ఎక్కువగా తింటున్నారు. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పనీర్‌ను అతిగా తీసుకోవడం వల్ల అందులో ఉండే ప్రొటీన్ల వల్ల వాంతులు, విరేచనాల సమస్య రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చీజ్ వల్ల అలెర్జీ..తరచుగా చాలా మంది అలెర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణాలు చీజ్‌ను ఆహారాల్లో అతిగా తీసుకోవడం వల్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే వీటిని అతిగా తీసుకుంటే చాలా మంది చర్మంపై తీవ్ర సమస్యలు వచ్చి.. అలెర్జీ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ చీజ్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు.. పనీర్‌ను తీసుకోవడం వల్ల శరీర ఫిట్‌నెస్ పెరుగుతుంది. అంతేకాకుండా వీటిని అతిగా తీసుకోవడం వల్ల అధిక రక్త పోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి. పనీర్ అతిగా తీసుకుంటే కొందరిలో గుండె పోటు కూడా రావొచ్చు.