Health

Peanuts: ఉడకబెట్టిన పల్లీల గురించి ఈ విషయాలు తెలిస్తే చాలు, వెంటనే తినేస్తారు.

Peanuts: ఉడకబెట్టిన పల్లీల గురించి ఈ విషయాలు తెలిస్తే చాలు, వెంటనే తినేస్తారు.

Peanuts: వేరుశెనగలను ఎప్పుడైనా సరే నూనెలో వేయించి అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనివల్ల పల్లీల్లో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. అందుకే పల్లీలను ఉడకబెట్టి తినడమే మంచిది. ఇది మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అయితే పల్లీలు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాదాపు అందరికీ తెలిసిందే. అయితే, ఈ పల్లీలను వేయించి, తినటం కంటే ఉడికించి తినటం వల్ల రెట్టింపు ప్రయోజనం అంటున్నారు నిపుణులు. పల్లీలు ఉడికించి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: కోవిడ్‌ సమయంలో స్టెరాయిడ్స్‌ తీసుకున్నారా..?

వేరుశనగల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వీటిలో ఉండే అధిక ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్ కడుపుకు సంతృప్తినిచ్చి, అధిక ఆకలిని అడ్డుకుంటాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. ఉడికించిన వేరుశనగల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలతో సహా శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి. అంతేకాదు, పల్లీలని ఉడికించి తినడం షుగర్ బాధితులకు కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు.

ఇందులో మెగ్నీషియం ఇన్సులిన్ చర్యని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో సాయపడుతుంది. ఇందులో నియాసిన్, కాపర్, మెగ్నీషియం, ఒలేయిక్ యాసిడ్, రెస్వరాట్రల్ వంటి గుండె జబ్బుల్ని దూరం చేస్తుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు. కాబట్టి, వీటిని ఉడికించి తినడం చాలా మంచిది. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఫోలేట్, నియాసిన్ వంటి పోషకాలు ఉడికించిన వేరుశనగల్లో మెండుగా ఉంటాయి. నాడీ వ్యవస్థకు సహాయపడి అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి.

Also Read: టీ తాగుతూ సిగరెట్‌ తాగుతున్నారా.?

ఉడికించిన వేరుశనగలో డ్రైఫ్రూట్స్‌తో సమానమైన పోషకాలు ఉంటాయి. విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. అవయవాల ఎదుగుదలకు కావల్సిన బి కాంఫ్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి. వేరుశెనగలను ఉడకబెట్టినప్పుడు, బయోయాక్టివ్ సమ్మేళనాల పరిమాణం పెరుగుతుంది. వీటిలో ప్రోటీన్స్, సెలీనీయం, మెగ్నీషియం, ఐరన్‌ లభిస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker