పర్‌ఫ్యూమ్ రోజు వాడుతున్నారా..? ఆ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
పర్‌ఫ్యూమ్ సువాసనకే కాదు వ్యక్తిత్వాన్ని, హూందాతన్ని ప్రతిబింబిస్తుంది. వేలు పెట్టి కొన్నా వాసన కొన్ని గంటల్లో పోయేదే కదా అనుకుంటారు. ర్‌ఫ్యూమ్ కొనే ముందు.. బాటిల్‌పై టాప్, బాటమ్, మిడిల్ అనే మూడు ఇన్‌స్ట్రక్షన్లు ఉన్నాయో లేదో చూడండి. టాప్.. అంటే స్ప్రే చేసిన 15 నిమిషాల తర్వాత సువాసన వస్తుంది. కొంచెం సేపు ఉండి సువాసన రాకుండా ఉంటుంది. అయితే రోజు పెర్ఫ్యూమ్స్ , బాడీ స్ప్రేస్ వాడటం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది అంటున్నారు నిపుణులు.
రసాయనాలతో తయారైన సెంట్, పెర్ఫ్యూమ్ చర్మం మీద స్ప్రే చేయటం వల్ల స్కిన్ ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉందట. మార్కెట్ లో రకరకాల పువ్వుల పేర్లతో ఎన్నో రకాల పెర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేస్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. మంచి సువాసన కోసం ప్రజలు వాటిని వాడుతున్నారు. కాని ఇలా పెర్ఫ్యూమ్స్ వాడేవారిలో 2శాతం మంది విష ప్రభావాలకి గురి అవుతున్నట్టు పరిశోధనలో తేలింది అంటున్నారు శాత్రవేత్తలు.
అంతేకాదు వారి పరిశోధలో ఇంకొన్ని ఆశ్చర్యపోయే నిజలు కూడా తెలిశాయట. పెర్ఫ్యూమ్స్ అలవాటు ఉన్నవారికి ఎక్కువ శాతం డిప్రెషన్ సమస్య పెరుగుతోంది అంటున్నారు శాత్రవేత్తలు. ఈ సమస్య రోజురోజుకు పెరిగి వైద్యానికి కూడా అందనంత లోతుకు వెళ్తుందని వివరించారు.ఇన్ని దుష్ప్రబవాలు చూపే సెంట్ పెర్ఫ్యూమ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అందుకని వారి సూచల మేరకు వీలైనంత వరకు రసాయనకర పెర్ఫ్యూమ్స్, సెంట్స్ కి దూరంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈరోజుల్లో అనారోగ్యం పాలై లక్షలకు లక్షలు డబ్బు ఆసుపత్రి పాలు చేసేదానికంటే కూడా సువాసనవెదజల్లే రసాయానిక సెంట్లకి దూరంగా ఉండటం ఎంతో మంచిది.