ఈ చిట్కాతో పైల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం.
పైల్స్ మన భాషలో అర్శమొలలు అంటారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి. అవి రక్తంతో నిండి పిలకల్లా మలద్వారం గుండా బయటకు పొడుచుకు వస్తాయి. ఈ మొలలనే హేమోరాయిడ్స్ అని వైద్య పరిభాషలో అంటారు. అయితే ఇది వంశపారంపరంగా వచ్చే వ్యాధి, కానీ మారుతున్న జీవనశైలిలో దీనిని ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నారు. మనలో చాలామంది, కదలకుండా ఒకే చోట కూర్చొని ఎక్కువసేపు పనిచేయడం వల్ల మొలలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
పైల్స్ రావటానికి ముఖ్యంగా నీరు తక్కువగా తాగడం, మద్యం ఎక్కువగా శ్రమించడం, ఫాస్ట్ ఫుడ్లు, వేపుళ్ళు మాంసాహారం ఎక్కువగా తినడం. వీటి ద్వారా మొలలు వచ్చే అవకాశం ఎక్కువ. మొలలు వచ్చిన వారిలో మలవిసర్జన సమయంలో నొప్పి, మంట,రక్తస్రావం అనేవి ఎక్కువగా వచ్చి బాధిస్తాయి. ప్రయాణాలు చేయడం కష్టమవుతుంది.దానిమ్మ పండు తొక్కను నీళ్లలో వేసి ఉడికించి, వడగట్టి రోజుకు రెండు గ్లాసులు త్రాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం, నిమ్మరసం, తేనె కలిగిన మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తాగినట్లయితే వాడిలోని డిహైడ్రేషన్ మొత్తం తగ్గే అవకాశం ఎక్కువ. పచ్చి ఉల్లిపాయ లేదా ఉల్లిపాయ రసాన్ని త్రాగడం వల్ల రక్తస్రావం కాకుండా నొప్పి తగ్గే విధంగా ఉపయోగపడుతుంది. అంజీర పండును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం ద్వారా మలబద్ధకం తగ్గి మొలలు పూర్తిగా నయం అవుతాయి. అంజీర పండు నానబెట్టిన నీటిని ఉదయం సాయంత్రం త్రాగడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
వ్యాయామం ఎక్కువ, తక్కువ కాకుండా సాధారణంగా చేసినట్లయితే మలబద్ధకం తగ్గి రక్తప్రసరణ బాగా జరిగి రక్తస్రావం కాకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. పసుపు అనేది అనేక వైద్య లక్షణాలు కలిగి ఉంటుంది పసుపు కొమ్ము లేదా కొంచెం పసుపు నువ్వు నీటిలో కలుపుకొని తాగితే మంచి ఉపయోగం ఉంటుంది. అరటిపండును ప్రతిరోజు తినడం వలన మంచిది. ఇంకా ప్రతి భోజనం తర్వాత తిన్నట్లయితే మరీ మంచిది ఇది కూడా మొలలు తగ్గడానికి చాలా బాగా సహాయం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు నీరు ఎక్కువగా త్రాగాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి.