ఎలాంటి ఖర్చు లేకుండా నిమ్మకాయతో మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు.
మహిళల సౌందర్యాన్ని సవాల్ చేసే సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. మగ వారిలో కూడా ఈ సమస్య కనిపించినా వారు పెద్దగా దీనిని పట్టించుకోరు. పింపుల్స్ సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ వస్తాయి. ముఖంపైనేకాకుండా చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. అయితే చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఫుడ్‌లను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్ లభించే వివిధ రకారల ప్రోడక్ట్‌ను వాడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే వీటి నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యలకు నిమ్మకాయ ప్రభావంతతంగా పని చేస్తుందని.. చర్మ సమస్యలకు వాటిని వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. నిమ్మరసం చర్మంపై మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.
కావున దీనిని వారానికి రెండు లేదా మూడు సార్లు వినియోగిస్తే.. మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సన్ టాన్, ముడతలను కూడా తొలగిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి నిమ్మరసం చాలా మేలు చేస్తుంది. ఇందుకోసం వారానికి మూడుసార్లు నిమ్మరసాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో మెరుపు పెరుగుతుంది. మొటిమలను తొలగిస్తుంది.. మొటిమల సమస్యను తొలగించడానికి నిమ్మరసం ప్రభావవంతంగా కృషి చేస్తుంది. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.
ఇవి ముఖంపై వచ్చే మొటిమలు తొలగించడానికి సహాయపడుతుంది. నిమ్మరసాన్ని ముఖానికి ఎలా అప్లై చేయాలి.. నిమ్మరసాన్ని నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల పలు రకాల దుష్ర్పభావాలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల ఎల్లప్పుడూ నిమ్మరసంలో కొన్ని పదార్థాలను కలిపిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. అయితే నిమ్మరసంలో.. చెంచా అలోవెరా జెల్ మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.