News

ప్రణీత్ హనుమంతుపై మంచు లక్ష్మి ఫైర్, తల బహిరంగంగా నరకాలి అంటూ..?

యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా కొంతమందికి సుపరిచితుడైన ప్రణీత్. నటుడిగా ఎక్కువమందికి తెలియదు. కానీ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో కొన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. ఈక్రమంలో అతడు చేసిన ఓ పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐఎఎస్ అధికారి హనుమంతు అరుణ్‌కుమార్‌ ఏపీ ప్రజలకు సుపరిచితుడు. అయితే ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతు వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

వావి వరసలు మరిచిపోయి తండ్రీ, కూతుళ్ల అనుబంధ మీద అతను చేసిన దారుణమైన కామెంట్స్ పట్ల చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఈ వివాదంపై స్పందించారు. సదరు యూట్యూబర్ పై కఠిన చర్యలకు ఆదేశించారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, సుధీర్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ప్రణీత్ హనుమంతు విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.

తాజాగా మంచు లక్ష్మి ప్రణీత్ హనుమంతు వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ గా మాట్లాడిన ఆమె.. చిన్న పిల్లల పట్ల ఇలా అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ల తలని బహిరంగంగా నరకాలన్నారు. మంచు లక్ష్మి నటించిన ‘ఆదిపర్వం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన సినిమా టీజర్లు, ట్రైలర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ఆది పర్వం యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. మంచు లక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రణీత్ హనుమంతు వ్యవహారంపై స్పందించారు మంచు లక్ష్మి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker