పెళ్ళై రెండు నెలలకే తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ AL విజయ్ ను ప్రేమించ పెళ్లాడింది. అయితే వీరిద్దరికి విబేధాలు రావడంతో మూడేళ్లు కూడా నిండకుండానే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత విజయ్ వేరే అమ్మాయిని పెళ్లాడాడు. ఇక అమలా.. విజయ్ తరువాత ఒకరితో ప్రేమలో ఉంది. అతనినే పెళ్లాడింది అనుకొనేలోపు అతడిపైనే చీటింగ్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించింది. ఆ తరువాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు, సినిమాలు తీయడం మొదలుపెట్టింది. ఇక గతేడాది ఈ చిన్నది జగత్ దేశాయ్ ను వివాహమాడింది.
అయితే తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసిందామె. వీటికి ‘మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అమలా పాల్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమలా పాల్ గతేడాది నవంబర్‌లో కొచ్చి వేదికగా ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది.
ఇది ఆమెకు రెండవ వివాహం. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. అమలా పాల్, జగత్ దేశాయ్ తమ రొమాంటిక్ ఫొటోస్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు. 2011లో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి కాపురంలో విభేదాలు తలెత్తడంతో 2017లో పరస్పర అంగీకారంతో విడిపోయారు.
ఆ తర్వాత అమల, జగత్ దేశాయ్ కొంతకాలం ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్ లో కొచ్చి వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కేరళకు చెందిన అమలా పాల్ దక్షిణాది భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. 2009లో సినీ రంగ ప్రవేశం చేసిన అమల కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో నాగచైతన్య బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
లవ్ ఫెయిల్యూర్, ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు,పిట్ట కథలు వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. ఈ మధ్యన వెబ్ సిరీసుల్లోనూ ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార. తెలుగులో ఆమె నటించిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతేకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.