మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అది ప్రొస్టేట్ క్యాన్సర్ కావొచ్చు. వెంటనే ఏం చెయ్యాలంటే..?
ప్రొస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌నే ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రొస్టేట్ గ్రంథి వాల్‌నట్ పరిమాణంలో కటి భాగంలోని బ్లాడర్‌కి పక్కనే ఉంటుంది. ఇది వీర్యపు స్రావాలను ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు ఎక్కువే అయినప్పటికీ.. ప్రారంభ దశలో బయటపడే కేసులు చాలా తక్కువ. ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశ దాటిందంటే.. అది ఎముకలు, ఇతర అవయవాలకు కూడా విస్తరిస్తుంది.
వ్యాధి తీవ్రత ఎక్కువైతే మరణం సంభవిస్తుంది. అయితే మారుతున్న వాతారణ పరిస్థితులు, జీవన విధానం, ఆహార అలవాట్లలో మార్పులు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో వీర్యగ్రంథి క్యాన్సర్ ఒకటి. ఈమధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లలో ఇది రెండో స్థానంలో ఉంది. కణతి పెరిగినప్పుడు లక్షణాలు.. ప్రొస్టేట్ గ్రంధి..
క్యాన్సర్ బారిన పడటాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ఈ గ్రంధి మగవారిలో చిన్న వాల్‌నట్ ఆకారంలో ఉంటూ, సెమినల్ ఫ్లూయిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. క్యాన్సర్ సోకడం వల్ల ఈ గ్రంధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాధారణంగా క్యాన్సర్ సోకితే అంత త్వరగా లక్షణాలు బయటపడవు. అవి అభివృద్ధి చెందడానికి, వ్యాప్తి చెందడానికి చాలా సమయం తీసుకుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిన పురుషుల్లో ప్రారంభంలో లక్షణాలు బయటపడవు. కణతి పెరిగినప్పుడే లక్షణాలు కనిపిస్తాయి. ముందుగా గుర్తించి చికిత్స పొందితే మంచిది.
తద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు క్యాన్సర్ వ్యాపించకుండా ఆపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభంలో లక్షణాలు.. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించడానికి కొన్ని లక్షణాలు పరిశీలించాలి. రాత్రి సమయంలో తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, మూత్ర విసర్జన ప్రారంభంలో ఇబ్బందిగా ఉండడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు ఎక్కువ సమయం పట్టడం లేదా మూత్ర విసర్జనకు ఒత్తిడి చేయాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు ఈ క్యాన్సర్ లేనివారికి కూడా ఉంటాయి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా మూత్రాశయం ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాప్తి దశలు.. సాధారణంగా ఈ క్యాన్సర్ వ్యాప్తి నాలుగు దశల్లో ఉంటుంది. III, IV స్టేజ్‌ల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉంటుంది. ఈ దశలో క్యాన్సర్‌ను నయం చేయలేరు. ఎందుకుంటే అప్పటికే క్యాన్సర్ శోషరస కణుపులు, ఎముకలు, కాలేయం, ఊపిరితిత్తుల వంటి ఇతర భాగాలకు వ్యాపించి ఉంటుంది. ఇక మొదటి, రెండో దశలో ఉంటే చికిత్సా పద్దతుల ద్వారా నయం చేయడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.