Health

ప్రోస్టేట్ క్యాన్సర్‌ వచ్చే ముందు సైలెంట్ గా కనిపించే లక్షణాలు ఇవే.

ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కారణం స్పష్టంగా తెలియదు. అయితే, వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 80 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. వారి కుటుంబంలో ఎవరైనా ఇప్పటికే ప్రోస్టేట్ క్యాన్సర్ చరిత్రను కలిగి ఉన్నట్లయితే, వారికి జన్యువుల పరంగా కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ప్రోస్టేట్ అనేది చిన్న వాల్ నట్ ఆకారంలో ఉండేటు వంటి గ్లాండ్.

ఇది మగవారిలో ఉంటుంది దాని వల్ల సెమినల్ రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ ఫ్లూయిడ్ వల్ల స్పెర్మ్స్ సరైన విధంగా ప్రసరించటానికి,మరియు స్పెర్మ్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్ గ్లాండ్ లో ఉండే కణాల దగ్గర ప్రారంభమవుతుంది. వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు.. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది బ్లాడర్, యురెట్రాకు సమీపంలో ఉంటుంది. దీని వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు యూరినరీకు సంబంధించిన ఇన్ ఫెక్షన్లు వస్తాయి.

వ్యాధి ప్రారంభంలో మూత్ర విసర్జన మార్పు గమనించవచ్చు. కొందరికి తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరికలు ఉంటాయి. ఎక్కువ సార్లు యూరిన్ రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్‌లో రక్తం రావడం, సెమెన్‌లో రక్తం రావడం, బ్లాడర్ కంట్రోల్‌లో లేకపోవడం, యురినేషన్ సమయంలో నొప్పిని ఎదుర్కోవడం, మంట, వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు మూత్ర విసర్జన చేయడం కష్టం అవుతుంది. వీటితోపాటుగా నడుము కాళ్ళు, పాదాలలో నొప్పి, స్పర్శ లేకపోవడం, ఎముకలు బాగా నొప్పిగా ఉండడం, విరగటం వంటి లక్షణాలు ఉంటాయి.

సంభోగం సమయంలో నొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బందులు వంటి సమస్యలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఒక వేళ సమస్యను గుర్తించినట్లైతే తక్షణం చికిత్స పొందటం మంచిది. క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారు మంచి ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలను తీసుకుంటారో వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరిగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker