ఈ ఆకులు రెండు తింటే మతి మరుపు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగివున్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబం ధవ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. అయితే పుదీనా పేరు వింటే చాలు ఎవరికైనా సరే నోట్లో నీళ్లు ఊరతాయి.
ఎందుకంటే పుదీనా ఆకులు వంటలకు అద్భుతమైన పరిమళాన్ని ఇస్తాయి.ముఖ్యంగా పుదీనా లేకపోతే బిర్యానీకి రుచే ఉండదు. అయితే పుదీనాను కేవలం రుచి కోసం మాత్రమే వంటల్లో ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటు పడినట్లే. పుదీనా వలన ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు కూడా కలుగుతాయి.ఈ పుదీనా అనేది సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా మనకు అందుబాటులో ఉంటుంది. పుదీనాలో ఉన్న ఔషద గుణాలు మతిమరుపును తగ్గిస్తాయా..? పుదీనాలో చాలా ఔషద గుణాలున్నాయి. అందుకే పుదీనాను అనేక ఆయుర్వేద మందుల తయారీలో వాడుతున్నారు.
అలాగే పుదీనాను టూత్ పేస్టుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ పుదీనాలో విటమిన్ A, Cతో పాటు బి-కాంప్లెక్స్ విటమిన్స్ కూడా పుష్కలంగా దొరుకుతాయి.పుదీనా తినడం వలన మెదడు పనితీరు మెరుగుపపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరిగి మతిమరుపు తగ్గుతుంది. అందుకే మతి మరుపుతో బాధ పడేవారు పుదీనాను ప్రతిరోజు చట్నీ, కషాయం, సలాడ్స్ రూపంలో ప్రతిరోజు తీసుకోవాలి.ఇలా చేయడం వలన మెదడుకు కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయి. గర్భిణులు పుదీనా తినవచ్చా..?
అంతేకాకుండా పుదీనా ఆకులు చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. పుదీనాలో ఐరన్, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. కడుపుతో ఉన్న మహిళలు వికారం, వాంతులతో బాధపడుతూ వుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం పూట కొన్ని పుదీనా ఆకులను తినటం వల్ల వికారం, వాంతి లక్షణాలు తగ్గుతాయి. పుదీనాలో ఉన్న నూనెలు తాజా శ్వాసను, దంత సంరక్షణను కలిగిస్తాయి. అందుకే పుదీనా నూనె ఉన్న మౌత్ ఫ్రెషనర్ లు వాడితే నోటిలోని బ్యాక్టీరియా నశించి చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.