రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ తాగితే ఎముకలు స్ట్రాంగ్ మారతాయి.
శరీరంలో నీటి శాతం తగ్గడంతో పాటు శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే శరీరంలో చలువని పెంచేందుకు మన పూర్వీకుల జావను తయారు చేసుకుని తాగేవారు. మొదట్లో జవాల వాడకం తక్కువగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో వీటి ప్రాధాన్యత పెరిగింది. జవాలు చేసే ఉపయోగాలు తెలిసినప్పటి నుంచి వీటి వాడకం ఎక్కువైపోయింది. అయితేచిరు ధాన్యాలయిన రాగులను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యంతోపాటు, అందానికి తోడ్పడతాయి. రాగి జావను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది.
అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రాగులను తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం అంది తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు దోహదం చేస్తాయి. రాగుల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నాయి. మధుమేహ రోగులకు మంచి ఆహారం.
రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షించటంతోపాటుగా, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఉన్నాయి. కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు, ఏదైనా జబ్బు బారిన పడినప్పుడు, శరీరంలో వేడి అధికంగా ఉన్నప్పుడు రాగి జావను తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రాగి జావలో మనం పంచదారను లేదా బెల్లాన్ని వేసుకుని తియ్యగా కూడా చేసుకుని తాగటం వల్ల శరీరంలోని అధిక వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.
రాగి జావా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. డీహైడ్రేషన్ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. నిత్యం ఆహారంలో రాగిజావను భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. నిత్య యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.