Rain: భారీ వర్షాలకి రోడ్డుపైకొచ్చిన పెద్ద పెద్ద చేపలు..! వైరల్ వీడియో.

Rain: భారీ వర్షాలకి రోడ్డుపైకొచ్చిన పెద్ద పెద్ద చేపలు..! వైరల్ వీడియో.
Rain: భారత వాతావరణ శాఖ ప్రకారం.. తెలంగాణలో 21 నుంచి 24వ తేదీ వరకూ, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే.. ఇవాళ సోమవారం రాయలసీమలో భారీ వర్షం పడుతుంది. కోస్తాంధ్ర, యానాంలో 21 నుంచి 24 వరకూ భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే.. కేరళ, కర్ణాటకలో 21 నుంచి 26 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా పడతాయి.అయితే గత రెండు రోజులుగా రాజస్థాన్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగౌర్ జిల్లాలోని పలు ప్రాంతాలు, గ్రామాలు జలమయమయ్యాయి. నదులు, డ్రైనేజీలు, ఆనకట్టలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.
భారీ వర్షాల దాటికి అక్కడ లంపోలై చెరువు పొంగిపొర్లింది. అందులోని నీరు రోడ్డపైకి రావడంతో చెరువులోని పెద్ద పెద్ద చేపలు రోడ్లపై భారీ సంఖ్యలో ఈదుతూ కనిపించాయి. దీంతో స్థానికులు వాటిని పట్టుకునేందుక రోడ్లపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా అతలాకుతలమైంది.
భారీ వర్షాల కారణంగా అజ్మీర్, బుండి, పాలి, పుష్కర్, సవాయి మాధోపూర్ సహా అనేక నగరాల్లో వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా నదులు, డ్రెయిన్లు, ఆనకట్టలు పొంగి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని అనేక గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా జోధ్‌పూర్-జైపూర్ హైవేలోని బనాద్ రోడ్డు కూడా జలమయమైంది.
దీంతో అనేక వాహనాలు రహదారిపై చిక్కుకుపోయాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జైపూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ రాధే శ్యామ్ శర్మ తెలిపారు. జూలై 27-28 తేదీల్లో తూర్పు రాజస్థాన్‌కు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
नागौर में सड़कों पर तैरने लगीं मछलियां!!
— Vinod Bhojak (@VinoBhojak) July 20, 2025
नागौर के रियाबड़ी गांव में लगातार बारिश से #लाम्पोलाई_तालाब ओवरफ्लो हो गया जिससे तालाब की मछलियां 🐟 🐠 बाहर निकलकर सड़कों पर तैरती नजर आईं, लोगों का कहना है कि उन्होंने अपने जीवन में ऐसी बारिश कभी नहीं देखी#Weather #Nagaur #Rajasthan pic.twitter.com/DJZ4xvL3bJ