News

లావణ్యతో పాటు మరికొందరు అమ్మాయిలతో రాజ్ తరుణ్ రిలేషన్. వెలుగులోకి షాకింగ్ నిజాలు.

నిన్నటి నుంచి లావణ్య అందుబాటులో లేనట్లు టాక్ నడిచింది. మరోవైపు హీరోయిన్ మాల్వీ మల్హో్త్రా మీడియా ముందుకొచ్చారు. తనకు రాజ్‌ తరణ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్‌తరుణ్‌ తనకు సహనటుడు మాత్రమే అని.. లావణ్య చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు మాల్వీ మల్హాత్రా. రాజ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ని లావణ్య అనుమానిస్తుందని.. అందరిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అయితే అనిన్నటి నుంచి కనిపించకుండా పోయిన రాజ్ తరుణ్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ లావణ్య… మీడియా ముందుకు వచ్చింది. 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్నామని.. రాజ్ తరుణ్‌ను రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నానని తెలిపింది.

మాల్వితో రాజ్‌తరుణ్ సినిమా చేసినప్పటి నుంచి మా మధ్య గొడవలు మొదలయ్యాయని, అంతేకాకుండా మాల్వి నన్ను చంపుతానని బెదిరించింది చెప్పింది. మాల్వి మాత్రమే కాదు.. ఆమె తమ్ముడు కూడా బెదిరించాడని చెప్పింది. నన్ను బెదిరించిన ఆధారాలను పోలీసులు ఇస్తాను. అంతేకాకుండా ఇతర యువతులతో కూడా రాజ్‌తరుణ్‌కు రిలేషన్ షిప్స్ ఉన్నాయని… వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడించింది. ఇక రాజ్ తరుణ్‌పై శుక్రవారం లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఫైల్‌లో పేర్కొంది.

పదకొండేళ్ళుగా రాజ్ తరుణ్, తను రిలేషన్‌లో ఉన్నామని, కానీ ఇప్పుడు రాజ్ తరుణ్.. తనను దూరం పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తన సినిమాలోని హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ కారణంగా తనతో గత మూడు నెలలుగా దూరంగా ఉంటున్నాడని లావణ్య పేర్కొంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై రాజ్ తరుణ్ సైతం స్పందించాడు. తాను లావణ్యతో గతంలో రిలేషన్‌లో ఉన్న మాట నిజమే కానీ.. తనతో ఏడేళ్లుగా శారీరక సంబంధం లేదని, ఆమె టార్చర్ తట్టుకోలేక దూరంగా ఉంటున్నానని చెప్పాడు.

అంతేకాకుండా లావణ్య డ్రగ్స్ వాడటం మొదలు పెట్టిందని, ఇంట్లో డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయం బయటకు తెలిస్తే.. తన పరువు పోతుందని ఇన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా లావణ్య వేరే అబ్బాయితో రిలేషన్‌లో ఉందని, తన కన్నతండ్రిని కూడా మోసం చేసిందని.. ఆమెకు కేవలం డబ్బులు మాత్రమే కావాలని.. దీనికోసమే ఈ హై డ్రామా నడిపిస్తుందరి రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker