News

ఆ సమస్యలతో బాధపడుతున్న రష్మిక, ఎలా బయటపడిందంటే..?

కేవలం తెలుగు, కన్నడలోనే కాకుండా.. తమిళం, హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. మిషన్ మజ్ను తో నార్త్ ఆడియన్స్ ను అలరించింది. ఇక ప్రస్తుతం ఆమె పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది. అలాగే హిందీలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తుంది.

ఈ రెండు ల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. రష్మిక కొద్ది రోజులుగా చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లుగా వినిపిస్తున్నాయి. అయితే రష్మికకు చర్మ వ్యాధి సోకినట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీనికి కారణం ఆమె చేసిన లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టే. అయితే రష్మికకు తన రోజువారి పనులను డైరీగా రాసుకోవడం అలవాటు ఉన్నట్లు ఉంది. అలాగే తను ఆ రోజు ఏం చేసిందనేది అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.

అదే విధంగా సోమవారం కూడా తన డే షెడ్యూల్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. అందులో రష్మిక ఇలా రాసుకొచ్చింది. ”డియర్‌ డైరీ.. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్‌గా గడిచింది. లేవగానే కార్డియో వర్క్‌ అవుట్‌ చేశా. ఆ తర్వాత ఆహారం తీసుకున్నా. రేపటి షెడ్యూల్‌ కోసం బ్యాగ్‌ సర్దుకున్నా. అయితే ఎప్పటిలాగే నా చూట్టు వాతావారణం, మంచు నన్ను బయటకు వెళ్లకుండ డ్రామాలు చేశాయి.

ఇక సర్దడం అయిపోయాక మళ్లీ వర్క్‌ అవుట్‌ చేశా. ఆ తర్వాత డిన్నర్‌ చేశా. ఇక డెర్మట్‌..(డెర్మటాలజీ) అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా. ఇంపార్టెంట్‌ మీటింగ్‌ ఉంది. కానీ అది క్యాన్సిల్‌ అయ్యింది. తిరిగి ఇంటికి వచ్చేశా. ఇక గుడ్‌ నైట్‌. బాగా పడుకో” అంటూ హార్ట్‌ ఎమోజీలను జత చేసింది. ఇక్కడ పరిశీలిస్తే ఇందులో డెర్మట్ అంటే.. డెర్మటాలజిస్ట్ అని అర్థం అవుతోంది.

ఇక ఇది చూసి అంతా రష్మికకు ఏమైందా? అని కంగారు పడుతున్నారు. తనకు ఏదైనా చర్మ వ్యాధి సోకిందా? ఎందుకు డెర్మటాలజీ అపాయింట్‌మెంట్‌ తీసుకుందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్‌. కాగా రష్మిక తెలుగులో పుష్ప 2, హిందీలో యానిమల్‌ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్‌తో రష్మిక బిజీగా ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker