Ration Rice: ఇలాంటి బియ్యం విషంతో సమానం..! రోజూ తిన్నారంటే అంటే సంగతులు.

Ration Rice: ఇలాంటి బియ్యం విషంతో సమానం..! రోజూ తిన్నారంటే అంటే సంగతులు.
Ration Rice: మనలో చాలామంది రేషన్ బియ్యం తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే రేషన్ బియ్యంలో భాగంగా లావుగా ఉండే బియ్యానికి బదులుగా సన్నగా ఉండే బియ్యం ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రోజూ ఇలాంటి బియ్యంతో చేసిన అన్నం తింటే మాత్రం వ్యాధులను కొనితెచ్చుకున్నట్టే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దంపుడు బియ్యం తీసుకోవడం ద్వారా లభించిన స్థాయిలో పోషకాలు ఈ బియ్యం తీసుకుంటే లభించవు.

ఎప్పుడో ఒకసారి ఈ బియ్యంతో వండిన అన్నం తింటే నష్టం లేదు కానీ రోజూ తీసుకుంటే మాత్రం అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. పూర్వకాలంలో అందరు దంపుడు బియ్యంతో చేసిన ఆహారం తినేవారు. అందువల్లే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసేవాళ్ళు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, అభిరుచులు మారడం వల్ల చాలామందిని అలసట, నీరసం లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. పాలిష్ చేసిన బియ్యం గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలకు కారణమవుతుంది.
Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన యశోద వైద్యులు.
రోజుకు రెండు పూటలా ఇలాంటి రైస్ తీసుకుంటే మధుమేహం రిస్క్ పెరుగుతుంది. ఈ బియ్యం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభించవు. ఈ బియ్యం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ లభించదు. కిడ్నీ వ్యాధులతో బాధ పడేవాళ్ళకు ఈ రైస్ విషంతో సమానం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ బియ్యం ఊబకాయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం కావడంతో పాటు క్యాన్సర్ రిస్క్ ను పెంచుతుంది.
Also Read: ఫిష్ వెంకట్ బతకాలంటే అదొక్కటే మార్గం అంటూ అసలు విషయం చెప్పేసిన డాక్టర్స్.
ఈ బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు సైతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో టాక్సిన్లు చేరతాయి. ఈ బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల 40 సంవత్సరాల కంటే వయసు పైబడిన వారు ఈ బియ్యానికి దూరంగా ఉంటే మంచిది. ఈ బియ్యంలో కొవ్వుకు విరుగుడుగా పని చేసే లిసిథిన్ ఈ కూడా ఉండదు. మన శరీరానికి ఎంతో మేలు చేసే విటమిన్ ఇ సైతం ఈ బియ్యంలో ఉండదు. ఈ బియ్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల తిమ్మిర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Also Read: కాశీలో శివుని భక్తిలో లీనమైపోయిన టాలీవుడ్ హీరోయిన్..!
డబుల్ పాలిష్ రైస్ కు త్వరగా పురుగు పట్టదు. ఈ రీజన్ వల్లే ఎక్కువ మంది ఈ బియ్యం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన ఆహారపు అలవాట్లను మార్చుకోకపోతే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. డబుల్ పాలిష్ రైస్ తినే అలవాటు ఉన్నవాళ్లు రోజుకు ఒక పూట మాత్రమే తీసుకుంటే శరీరానికి కలిగే నష్టం కొంతమేర తగ్గుతుంది.