Raw Almonds: పచ్చి బాదంపప్పు తింటున్నారా..? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Raw Almonds: పచ్చి బాదంపప్పు తింటున్నారా..? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
Raw Almonds: పచ్చి బాదం పప్పుల్లో మంచి కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో , చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. అయితే పోషకాల శోషణలో ఇబ్బందులు.. పచ్చి బాదం పప్పులను ఎక్కువగా తినడం వల్ల మన శరీరం కొన్ని రకాల పోషకాలు గ్రహించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఎందుకంటే ఆకుపచ్చ బాదంలో టానిన్ ఉంటుంది. ఇది మన జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది. కాలేయానికి నష్టం.. పచ్చి బాదం పప్పులను ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాలేయంపైనా ప్రభావం పడుతుంది. ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
Also Read: ఆవు, గేదె పాలు కాకుండా.. ఈ పాలు తాగితే చాలు.
మైగ్రేన్ ఉన్నవారు తినొద్దు.. మైగ్రేన్‌తో బాధపడేవారు పచ్చి బాదం ఎక్కువగా తినకూడదు. ఒకవేళ ఎక్కువగా తింటే ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులో అనేక సమ్మేళనాలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో అనేక రసాయన ప్రతిచర్యలు జరుగుతాయి.
Also Read: ఈ దుంపలను తరచూ తింటే చాలు.
అందుకే పచ్చి బాదం పప్పును తినొద్దని వైద్యులు కూడా సూచిస్తారు. కిడ్నీ సమస్యలు.. బాదం పప్పు అతిగా తింటే.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇందులో ఆక్సలేట్ ఉన్నందున కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బాదం పప్నును తినకూడదని వైద్యులు సూచిస్తారు.