Health

Raw Garlic : మంచిదని పచ్చివెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా.? ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

Raw Garlic : మంచిదని పచ్చివెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా.? ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

Raw Garlic : వెల్లుల్లి లేకుండా వంటకం అసంపూర్ణంగా కనిపిస్తుంది. ఇది ఆహారానికి రంగు మరియు రుచిని జోడించడమే కాదు. వెల్లుల్లి అనేక ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ లక్షణాలు మానవ శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి. దిబ్రూగఢ్‌లోని సీనియర్ వైద్యురాలు డైసీ థ్, వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలపై కొన్ని సూచనలను అందిస్తున్నారు. అయితే వెల్లుల్లిలో అల్లిసిన్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి.

Also Read: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలు

ఇవి జలుబు, ఫ్లూ, ఇతర ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె ప్రమాదాలు తగ్గుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పలురకాల క్యాన్సర్​లను నిరోధించడంలో సహాయం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబు, ఫ్లూ వంటి ఇతర ఇన్​ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. గట్ బ్యాక్టీరియాను మెరుగుపరిచి పలు రకాల జీర్ణ ప్రయోజనాలు కూడా అందిస్తాయి.

పచ్చివెల్లుల్లిని రోజూ తీసుకోవాలనుకుంటే 1 లేదా 2 రెబ్బలు తీసుకుంటే మంచిది. ఫ్రెష్​గా, ఆర్గానిక్​గా ఉండే వెల్లుల్లిని తింటే మంచి ప్రయోజనాలు అందుతాయి. పాతవి లేదా మొలకెత్తిన వెల్లుల్లిని తినకూడదు. క్రష్ చేసి లేదా చాప్ చేసి తింటే దానినుంచి ఎంజైమ్లు విడుదలవుతాయి. వీటిని ఎక్కువగా ప్రాసెస్​ చేస్తే న్యూట్రింట్స్ తగ్గిపోతాయి. ఇతర ఫుడ్స్​తో కలిపి తినడం కంటే.. తేనెలో ముంచుకుని తింటే మంచిది.

Also Read: ఈ ఆకులరసాన్ని పరగడుపున తీసుకుంటే ఎంత మంచిదో తెలుసా..?

వెల్లుల్లిని పచ్చిగా తింటే కొందరికి కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. మరికొందరిలో దురద, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. మెడిసిన్స్ ఉపయోగించేవారు కచ్చితంగా వైద్యుల సలహాతో తీసుకుంటే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker